నాలుగో రోజూ లాభాలొచ్చాయ్
ABN, Publish Date - Jun 10 , 2025 | 04:30 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు గతవారం ఆర్‌బీఐ రెపో రేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో...
సెన్సెక్స్ 256 పాయింట్లు అప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు గతవారం ఆర్‌బీఐ రెపో రేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో మదుపరులు వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, వాహనం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 480 పాయింట్ల వరకు ఎగబాకినప్పటికీ, చివరికి 256.22 పాయింట్ల లాభంతో 82,445.21 వద్ద ముగిసింది. నిఫ్టీ 100.15 పాయింట్ల వృద్ధితో 25,103.20 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి ఈ ఏడాదిలో ఇదే గరిష్ఠ ముగింపు స్థాయి.
లలిత జువెలరీ రూ.1,700 కోట్ల ఐపీఓ: తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో షోరూమ్‌లను నిర్వహిస్తున్న స్వర్ణ, వజ్రాభరణాల విక్రయ సంస్థ లలిత జువెలరీ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా మొత్తం రూ.1,700 కోట్లు సమీకరించాలనుకుంటున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో వెల్లడించింది. అందులో రూ.1,200 కోట్లు తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 10 , 2025 | 04:30 AM