Share Market Recovery: 3 రోజుల తర్వాత లాభాల్లోకి
ABN, Publish Date - Jul 30 , 2025 | 05:05 AM
మూడు రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్‌కు కాస్త ఊరట లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్...
447 పాయింట్లు బలపడిన సెన్సెక్స్
ముంబై: మూడు రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్‌కు కాస్త ఊరట లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్ మంగళవారం మళ్లీ లాభాలబాట పట్టింది. ఒకదశలో 539 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్.. చివరికి 446.93 పాయింట్ల లాభంతో 81,337.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140.20 పాయింట్ల వృద్ధితో 24,821.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 19 లాభపడగా.. రిలయన్స్ షేరు 2.21 శాతం పెరిగి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.
4 నెలల కనిష్ఠానికి రూపాయి: భారత కరెన్సీ విలువ నాలుగు నెలలకు పైగా కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసల నష్టంతో రూ.86.91 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతోపాటు ముడిచమురు ధరల పెరగుదల మన కరెన్సీపై ఒత్తిడి పెంచింది.
టీసీఎస్ షేరు మరింత పతనం: 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గత వారాంతంలో ప్రకటించిన టీసీఎస్ షేరు విలువ మరో 0.73 శాతం తగ్గింది. క్రితం సెషన్‌లో దాదాపు 2 శాతం జారుకుంది. దాంతో గడిచిన రెండు రోజుల్లో కంపెనీ షేరు ధర 2.48 శాతం క్షీణించగా.. మార్కెట్ విలువ రూ.28,148 కోట్లకు పైగా తగ్గి రూ.11.05 లక్షల కోట్లకు పరిమితమైంది.
ఐపీఓకు లెన్స్‌కార్ట్
కళ్ల జోళ్ల విక్రయ కేంద్రాల నిర్వహణ స్టార్టప్ లెన్స్‌కార్ట్ కూడా ఐపీఓ జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూ ద్వారా 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,650 కోట్లు) వరకు సమీకరించే అవకాశం ఉందని బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. ఐపీఓలో భాగంగా రూ.2,150 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది.
స్వర్ణాభరణాల తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఐపీఓకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారం ఇష్యూ చివరి రోజు నాటికి ఏకంగా 80.80 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏసీసీ క్లారిటీ..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 30 , 2025 | 05:05 AM