Sensex Falls: ఆఖరి గంటలో అమ్మకాలు
ABN, Publish Date - Jul 04 , 2025 | 04:46 AM
స్టాక్ మార్కెట్ మదుపరులు ఆఖరి గంట ట్రేడింగ్‌లో ఆర్థిక సేవలు, లోహ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాల్లో...
సెన్సెక్స్ 170 పాయింట్లు పతనం
ఇంట్రాడే గరిష్ఠ స్థాయితో పోలిస్తే
610 పాయింట్లు కోల్పోయిన సూచీ
ముంబై: స్టాక్ మార్కెట్ మదుపరులు ఆఖరి గంట ట్రేడింగ్‌లో ఆర్థిక సేవలు, లోహ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. ఒకదశలో 440 పాయింట్ల వరకు ఎగబాకి 83,850 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. కానీ, మదుపరులు చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపటంతో సూచీ తిరోగమన బాటలో పయనించింది. 170.22 పాయింట్ల నష్టంతో 83,239.47 వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ఠ స్థాయితో పోలిస్తే, సెన్సెక్స్ 610 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ విషయానికొస్తే, 48.10 పాయింట్ల నష్టంతో 25,405.30 వద్ద స్థిరపడింది.
వాతావరణ డెరివేటివ్‌లు..
ప్రారంభించేందుకు ఐఎండీతో ఎన్‌సీడీఈఎక్స్ ఒప్పందం దేశంలో తొలిసారిగా వాతావరణ (వెదర్) డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తో నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్‌సీడీఈఎక్స్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు, వ్యవసాయ రంగ సంబంధిత వర్గాలు లోటు వర్షపాతం, వడగాల్పులు, అకాల వాతావరణ పరిస్థితులతో ఎదురయ్యే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు ఈ డెరివేటివ్ కాంట్రాక్టులు తోడ్పడగలవని ఎన్‌సీడీఈఎక్స్ పేర్కొంది. ఐఎండీతో భాగస్వామ్యంలో వర్షపాత ఆధారిత డెరివేటివ్‌లతోపాటు ఇతర కాంట్రాక్టులను అభివృద్ధి చేయనున్నట్లు, ఇందుకోసం ఐఎండీ గత, రియల్‌టైం డేటాను వినియోగించుకోనున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 04 , 2025 | 04:46 AM