ఐటీ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ABN, Publish Date - May 20 , 2025 | 03:38 AM
ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అమెరికా పరపతి రేటింగ్‌ను మూడీస్ ‘ట్రిపుల్ ఏ’ నుంచి ‘ఏఏ1’కు తగ్గించిన నేపథ్యంలో...
సెన్సెక్స్ 271 పాయింట్లు డౌన్
25,000 దిగువకు నిఫ్టీ
ముంబై: ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అమెరికా పరపతి రేటింగ్‌ను మూడీస్ ‘ట్రిపుల్ ఏ’ నుంచి ‘ఏఏ1’కు తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ట్రేడింగ్ సెంటిమెంట్ బలహీనపడటం కూడా మన మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సరికి, సెన్సెక్స్ 271.17 పాయింట్లు కోల్పోయి 82,059.42 వద్దకు జారుకుంది. నిఫ్టీ 74.35 పాయింట్ల నష్టంతో 24,945.45 వద్ద స్థిరపడింది. దాంతో సూచీ 25,000 కీలక స్థాయిని మళ్లీ చేజార్చుకుంది. బీఎ్‌సఈలోని 30 నమోదిత కంపెనీల్లో 18 నష్టపోయాయి.
ఈ నెలలో 6 ఐపీఓలు
రూ.11,000 కోట్ల సమీకరణ
ప్రైమరీ మార్కెట్లో మళ్లీ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ల సందడి మొదలైంది. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలోని ప్రధాన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో షేర్లను నమోదు చేయాలనుకుంటున్న 6 కంపెనీలు ఈ నెలలో ఐపీఓకు రానున్నట్లు ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ ఆరు కంపెనీలు మార్కెట్ నుంచి రూ.11,669 కోట్ల వరకు నిధులు సమీకరించనున్నాయని వారన్నారు. ఈనెలలో ఐపీఓ ప్రారంభించనున్న కంపెనీల జాబితాలో ‘ది లీలా’ బ్రాండ్‌నేమ్‌తో లగ్జరీ హోటళ్లను నిర్వహించే స్ల్కోస్ బెంగళూరు, బొరానా వీవ్స్, బెల్‌రైజ్ ఇండస్ట్రీస్, ఏజీస్ వోపక్ టెర్మినల్స్, అరి్‌సఇన్‌ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్, స్కోడా ట్యూబ్స్ ఉన్నాయి. బొరానా వీవ్స్, బెల్‌రైజ్ ఇప్పటికే తమ ఐపీఓ ధరల శ్రేణిని సైతం ప్రకటించగా.. మిగతా కంపెనీలు ఈ వారంలో వెల్లడించే అవకాశాలున్నాయి. స్ల్కోస్ బెంగళూరు ఐపీఓ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించనుంది. ఏజీస్ వోపక్ టెర్మినల్స్ రూ.3,500 కోట్లు, అరి్‌సఇన్‌ఫ్రా రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్ రూ.275 కోట్లు సేకరించనన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 20 , 2025 | 03:38 AM