ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాత కారు అమ్ముతుంటే

ABN, Publish Date - Jun 08 , 2025 | 03:29 AM

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రజల అభిరుచులు, అవసరాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు విలాస వస్తువు అనేది ఈ రోజు నిత్యావసరంగా మారుతోంది. అలాంటి వాటి జాబితాలో కారు ఒకటి. ఒకప్పుడు సంపన్నులకు...

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రజల అభిరుచులు, అవసరాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు విలాస వస్తువు అనేది ఈ రోజు నిత్యావసరంగా మారుతోంది. అలాంటి వాటి జాబితాలో కారు ఒకటి. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితమైన కారు ఈ రోజు మధ్య తరగతి ప్రజలకు కూడా అవసరంగా మారింది. కొత్త కార్లతో పాటుగా పాత కార్లను అమ్మటానికి ప్రముఖ కార్ల కంపెనీలన్నీ ప్రత్యేక షోరూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాకుండా పాత కార్లకు కూడా బ్యాంకులు లోన్‌ ఇవ్వటం మొదలు పెట్టడంతో పాత కార్ల మార్కెట్‌ క్రమేపీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక డీలర్‌ లేదా ఏదైనా కంపెనీ షోరూమ్‌ పాత కారు అమ్మేటప్పుడు జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉందా? ఉంటే ఎంత జీఎ్‌సటీ కట్టాలో చూద్దాం. కొత్త కార్లకు సంబంధించి జీఎ్‌సటీ అనేది గరిష్ఠ స్లాబ్‌ అంటే 28 శాతంగా ఉంది. అంతేకాకుండా కేటగిరీని బట్టి గరిష్ఠంగా 15 శాతం వరకు సెస్‌ కూడా ఉంది. జీఎ్‌సటీ వచ్చిన కొత్తలో పాత కార్లకు కూడా ఇదే విధంగా పన్ను శాతం నిర్ణయించటంతో పాత కార్ల అమ్మకందారుల్లో ఆందోళన నెలకొంది. ఆ తర్వాత రేట్లను 2018లో సవరించారు. దీని ప్రకారం పాత కార్ల మీద పన్ను శాతం కారు కెపాసిటీ, పొడవును బట్టి 12 నుంచి 18 శాతంగా నిర్ణయించటం జరిగింది.

ఇకపోతే ఈ ఏడాది జనవరిలో మళ్లీ దీనికి సవరణ చేయటం జరిగింది. కొత్త సవరణ ప్రకారం అన్ని రకాల సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు పన్ను 18 శాతంగా నిర్ణయించటం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ విధంగా అమ్మే పాత కార్లకు ఎలాంటి సెస్‌ లేదు. మరి ఈ పన్ను ఎంత విలువ మీద చెల్లించాలనే దాని మీద కూడా వివరణ ఇచ్చారు. ఇది కేవలం ‘మార్జిన్‌’ మీద చెల్లిస్తే సరిపోతుంది. మరి మార్జిన్‌ అంటే ఏమిటి? అమ్మకపు ధర.. కొన్న ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మార్జిన్‌గా భావించాలి. ఈ వ్యత్యాసం మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆదాయ పన్ను చట్టం ప్రకారం కారు మీద డిప్రిషియేషన్‌ (తరుగుదల) చూపించి ఉంటే.. అమ్మకం విలువ, ఆదాయ పన్ను అకౌంట్స్‌ ప్రకారం అమ్మకం నాటికి కారు విలువ (డిప్రిషియేషన్‌ పోగా మిగిలిన విలువ) మధ్య వ్యత్యాసాన్ని కారు విలువ కింద చూపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


అదే పాత కార్ల క్రయవిక్రయాలు జరిపే డీలర్‌ ఒక పాత కారును ఒక వ్యక్తికి విక్రయిస్తే ఆ కారు కొన్నప్పటి విలువ, అమ్మకం విలువ మధ్య వ్యత్యాసాన్ని కారు విలువగా చూపించి దాని మీద పైన సూచించిన విధంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యత్యాసం నెగటివ్‌గా ఉంటే.. అంటే కొనుగోలు ధర కంటే అమ్మకపు విలువ తక్కువగా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. ఒకవేళ, అమ్మకందారుడు కారు కొన్నప్పుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకుని ఉంటే పైన చెప్పిన పన్ను ప్రయోజనం అతనికి వర్తించదు.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.


ఇవీ చదవండి:

మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా.. లేదంటే రూ.10 వేల పైన్

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 03:29 AM