మదుపరులూ పారాహుషార్
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:34 AM
తమ పేరుతో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెబీ మరోసారి మదుపరులను హెచ్చరించింది. తమ పేరు...
కేటుగాళ్ల మోసాలపై జర జాగ్రత్త
న్యూఢిల్లీ : తమ పేరుతో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెబీ మరోసారి మదుపరులను హెచ్చరించింది. తమ పేరు మీద కేటుగాళ్లు పంపించే నకిలీ సమాచారం నమ్మి వ్యక్తిగత సమాచారం షేర్ చేయడంగానీ, డబ్బులు పంపడంగాని చేయవద్దని కోరింది. కొంత మంది మోసగాళ్లు సెబీ లోగో, లెటర్‌హెడ్, అధికారుల పేర్లతో మదుపరులకు తప్పుడు సమాచారం పంపిస్తూ మోసం చేస్తుండడంతో సెబీ ఈ హెచ్చరిక చేసింది. తాము పంపించే ప్రతి ఉత్తర్వు లేదా జారీ చేసే ప్రతి లెటర్‌కు ప్రత్యేక నంబరు ఉంటుందని తెలిపింది. మదుపరులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో తమకు వచ్చిన సమాచారాన్ని ధ్రువీకరించుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలని సెబీ కోరింది.
పాలసీదారులకు రూ.900 కోట్లకు పైగా రుణాలు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 2025 ఆర్థిక సంవత్సరంలో తమ పాలసీదారులకు సంప్రదాయ పాలసీలపై రూ. 900 కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. ఇది 42,700 మందికి పైగా ఖాతాదారులకు ఆకస్మిక ఆర్థిక అవసరాల సమయంలో అండగా నిలిచినట్లు సంస్థ ప్రకటించింది. 98%కు పైగా రుణాలు 24 గంటలలోపు, పూర్తిగా డిజిటల్ విధానంలో మంజూరైనట్లు చెప్పింది. 52% మంది ఖాతాదారులు కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 05 , 2025 | 09:52 PM