ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక గోల్డ్‌, సిల్వర్‌ ఈటీఎ్‌ఫలకు దేశీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ రేట్లే ప్రామాణికం

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:41 AM

బంగారం, వెండి ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ కలిగి ఉన్న భౌతిక బంగారం, వెండి విలువ లెక్కింపు విధానాన్ని పునఃసమీక్షించాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ యోచిస్తోంది. ఇందుకోసం మ్యూచువల్‌ ఫండ్‌...

  • ఈ విలువైన లోహాల విలువ లెక్కింపు విధానాన్ని మార్చే యోచనలో సెబీ

న్యూఢిల్లీ: బంగారం, వెండి ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ కలిగి ఉన్న భౌతిక బంగారం, వెండి విలువ లెక్కింపు విధానాన్ని పునఃసమీక్షించాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ యోచిస్తోంది. ఇందుకోసం మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు దేశీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు ప్రకటించే స్పాట్‌ ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని సెబీ ప్రతిపాదించింది. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌.. లండన్‌ బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ (ఎల్‌ఎంబీఏ) ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నాయని బుధవారం విడుదల చేసిన చర్చాపత్రంలో నియంత్రణ సంస్థ పేర్కొంది. గోల్డ్‌, సిల్వర్‌ ఈటీఎ్‌ఫల్లో మరింత స్థిరత్వంతో పాటు దేశీయ మార్కెట్‌ ధరలతో వీటిని అనుసంధానించేందుకు సెబీ తాజా ప్రతిపాదన దోహదపడనుంది. అంతేకాదు, దేశీయంగా ఒకే ప్రామాణిక ధరను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచే స్పాట్‌ ధరను నిర్ణయించేందుకు సమగ్ర పోలింగ్‌ విధానాన్ని కూడా రూపొందించాలని ఆలోచిస్తోంది. తాజా ప్రతిపాదనలపై ఆగస్టు 9లోగా అభిప్రాయాలు తెలపాలని సెబీ ప్రజలను కోరింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2025 | 05:45 AM