ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SEBI Probe: జేన్‌ స్ట్రీట్‌పై దర్యాప్తు నా హయాంలోనే షురూ

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:07 AM

మోసపూరిత ట్రేడింగ్‌ వ్యూహాల ద్వారా భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు ఆర్జించిన అమెరికన్‌ హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీ జేన్‌ స్ట్రీట్‌పై దర్యాప్తు తన హయాంలోనే మొదలైందని...

సెబీ మాజీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌

ముంబై: మోసపూరిత ట్రేడింగ్‌ వ్యూహాల ద్వారా భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు ఆర్జించిన అమెరికన్‌ హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీ జేన్‌ స్ట్రీట్‌పై దర్యాప్తు తన హయాంలోనే మొదలైందని సెబీ మాజీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ మంగళవారం అన్నారు. 2024 ఏప్రిల్‌ నుంచే జేన్‌ స్ట్రీట్‌ ట్రేడింగ్‌ విధానాలపై విచారణను ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే, జేన్‌ స్ట్రీట్‌ ఉదంతాన్ని నియంత్రణ వైఫల్యంగా చిత్రీకరించడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. జేన్‌ స్ట్రీట్‌ మార్కెట్‌ సూచీలను కృత్రిమంగా ప్రభావితం చేసినట్లు గుర్తించడంతో పాటు అనైతిక ట్రేడింగ్‌ వ్యూహాలకు స్వస్తి పలకాలంటూ 2024 ఏప్రిల్‌ నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో కంపెనీకి సర్క్యులర్లు, హెచ్చరికల జారీ సహా పలు చర్యలను సెబీ చేపట్టిందన్నారు. సెబీ సారథ్యం నుంచి బుచ్‌ ఈ మార్చిలో తప్పుకున్నారు. ఆమె స్థానాన్ని తుహిన్‌ కాంత పాండే భర్తీ చేశారు. కాగా, జేన్‌ స్ట్రీట్‌ గ్రూప్‌ను సెక్యూరిటీ మార్కెట్‌ నుంచి నిషేధిస్తూ సెబీ గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, రూ.4,843 కోట్ల అక్రమ లాభాలను తిరిగి తమ ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలని నియంత్రణ మండలి ఆదేశించింది.

సెబీ ఆదేశాలను సవాలు చేయనున్న జేన్‌ స్ట్రీట్‌

కంపెనీపై సెబీ అభియోగాలను తోసిపుచ్చిన జేమ్‌స్ట్రీట్‌.. నియంత్రణ మండలి ఆదేశాలను చట్టపరంగా సవాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. కాగా, తాను అక్రమంగా లబ్ది పొందేందుకు మార్కెట్‌ సూచీలను కృత్రిమంగా ప్రభావితం చేయడం ద్వారా చిన్న ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు మిగిల్చిన జేమ్‌ స్ట్రీట్‌పై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని కొందరు మార్కెట్‌ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఏదైనా కంపెనీపై క్రిమినల్‌ చర్యలు చేపట్టేందుకూ నియంత్రణ మండలికి సెబీ చట్టం అధికారం కల్పిస్తుందని న్యాయ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 06:08 AM