పిఎస్‌యూల స్వచ్ఛంద డీలిస్టింగ్‌కు సెబీ లైన్ క్లియర్
ABN, Publish Date - Jun 19 , 2025 | 05:37 AM
పెట్టుబడుల మార్కెట్‌లో మరిన్ని సంస్కరణలకు సెబీ శ్రీకారం చుట్టింది. చైర్మన్ తుహిన్ పాండే అధ్యక్షతన బుధవారం సమావేశమైన సెబీ బోర్డు దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలకు..
రీట్స్, ఇన్విట్స్‌కు ఈక్విటీ షేర్ల హోదా
క్యూఐపీ వెల్లడి నిబంధనల సరళీకరణ
న్యూఢిల్లీ: పెట్టుబడుల మార్కెట్‌లో మరిన్ని సంస్కరణలకు సెబీ శ్రీకారం చుట్టింది. చైర్మన్ తుహిన్ పాండే అధ్యక్షతన బుధవారం సమావేశమైన సెబీ బోర్డు దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
సెబీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు...
ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) స్వచ్ఛంద డిలిస్టింగ్ కు అనుమతిస్తూ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈక్విటీలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ప్రభుత్వానికి ఉన్న పీఎ్‌సయూలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. కాకపోతే ఇందుకు మెజారిటీ వాటాదారుల ఆమోదంతో పాటు, రెగ్యులేటరీ సంస్థల అనుమతి అవసరం. ఈ సంస్కరణతో పీఎ్‌సయూల వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుందని భావిస్తున్నారు.
స్టార్టప్స్- ఈసాప్స్: ఐపీఓల తర్వాత కూడా స్టార్టప్ కంపెనీల ప్రమోటర్లు ఉద్యోగుల తరహాలో ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్స్ (ఈసాప్స్) కలిగి ఉండేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. కాకపోతే ఐపీఓకు ఏడాది ముందే వీరు ఈ షేర్లను డిమ్యాట్ రూపంలో కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఐపీఓల తర్వాత స్టార్ట్‌పల వ్యవస్థాపకులను ప్రమోటర్లుగా పరిగణించి ఈసాప్ షేర్లు కలిగి ఉండేందుకు అనుమతించరు. తాజా సంస్కరణ స్టార్టప్ కంపెనీల దీర్ఘకాలిక వృద్ధిలో ప్రమోటర్లు మరింత మమేకమయ్యేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.
ఏఐఎ్‌ఫలకు వెసులుబాటు: ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల్లో (ఏఐఎఫ్) మదుపు చేసే వారికి సెబీ కొత్త వెసులుబాటు కల్పించింది. ఇక ఈ మదుపరులు ఏఐఎ్‌ఫలు పెట్టుబడులు పెట్టిన అన్‌లిస్టెడ్ కంపెనీల్లో అదనపు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తారు. కాకపోతే ఏఐఎ్‌ఫలు ఇందుకోసం ప్రత్యేక పథకంలా ఒక స్వతంత్ర కో ఇన్వె్‌స్టమెంట్ వెహికల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏఐఎ్‌ఫల మేనేజర్లు అన్ని రకాల మదుపరులకు సలహా సేవలు అందించేందుకూ సెబీ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ రుణ పత్రాలు - ఎఫ్‌పీఐలు: ప్రభుత్వ రుణ పత్రాల్లో విదేశీ పోర్టుఫోలియో మదుపరుల పెట్టుబడుల రిజిస్ట్రేషన్, కంప్లయన్స్ ప్రక్రియను సెబీ మరింత సులభం చేసింది. దీంతో ఎఫ్‌పీఐలు మరింత చురుగ్గా పెద్దగా నష్ట భయం లేని ప్రభుత్వ రుణ పత్రాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. వీటికి తోడు ఇన్‌ఫ్రా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు జారీ చేసే ఇన్విట్స్, రీట్స్‌ను ఈక్విటీ షేర్లుగా పరిగణించేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. క్యూఐపీ ఇష్యూల నిబంధనల వెల్లడినీ మరింత సులభతరం చేసింది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 19 , 2025 | 05:37 AM