ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Equity Bonds: ఈక్విటీ బాండ్ల జారీ ద్వారా రూ 45,000 కోట్ల సమీకరణ

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:22 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభు త్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా మొత్తం రూ.45,000 కోట్ల వరకు నిధులు సమీకరించనుంది. అందులో రూ.25,000 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా...

ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభు త్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా మొత్తం రూ.45,000 కోట్ల వరకు నిధులు సమీకరించనుంది. అందులో రూ.25,000 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా సేకరించనున్నట్లు బ్యాంక్‌ బుధవారం ప్రకటించింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) పద్ధతిలో సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా ఈ నిధులు సమీక రించనున్నట్లు తెలిపింది. షేరు కనీస ధరను రూ.811.05గా నిర్ణయించింది. బుధవారం బీఎ్‌సఈలో బ్యాంక్‌ షేరు ముగింపు ధర రూ.831.55తో పోలిస్తే 2.46 శాతం తక్కువ ఇది. క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణకు బ్యాంక్‌ బోర్డు మే నెలలోనే ఆమోదం తెలపగా..షేర్‌హోల్డర్లూ గత నెలలోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కాగా, దేశీయ ఇన్వెస్టర్లకు బాం డ్ల జారీ ద్వారా మరో రూ.20,000 కోట్లు సమీకరించనున్నట్లు, ఇందుకు బోర్డు కూడా అంగీకారం లభించిందని తెలిపింది. ఎస్‌బీఐ చివరిసారి 2017-18లో క్యూఐపీ ద్వారా రూ.15,000 కోట్లు పోగేసింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2025 | 05:31 AM