Sai Parenterals: సాయి పేరెంటరల్స్‌కు రూ 50 కోట్ల నిధులు
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:43 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫార్మా సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్.. ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్టర్ల నుంచి రూ.50 కోట్ల నిధులను సమీకరించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫార్మా సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్.. ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్టర్ల నుంచి రూ.50 కోట్ల నిధులను సమీకరించింది. సమర్ష్ క్యాపిటల్, వ్యోమ్ పార్ట్‌నర్స్ సహా బ్లూ లోటస్ క్యాపిటల్ అనుబంధ సంస్థల నుంచి ఈ మొత్తాలను సమీకరించినట్లు సాయి పేరెంటరల్స్ ఎండీ అనిల్ కరుసాల తెలిపారు. వ్యాపార కార్యకలాపాల విస్తరణ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీగా ఎదగాలన్న లక్ష్య సాధనకు ఈ మొత్తాలను వెచ్చించనున్నట్లు అనిల్ చెప్పారు.
కిర్ఘిస్థాన్‌లో తమ కంపెనీ చేపట్టిన గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికే ప్రారంభమవుతుందని దక్కన్ గోల్డ్ మైన్స్ తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అవసరమైన యంత్ర పరికరాలకు ఆర్డర్ పెట్టామని, అవి చేతికి అందితే.. వచ్చే రెండు నెలల్లోనే ఖనిజం వెలికితీత, క్రషింగ్, పసిడి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
ఇవీ చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:43 AM