ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విమానాల నవీకరణపై రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఫోకస్‌

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:57 AM

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి ప్రవేశించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా విమానాలు, హెలికాప్టర్ల ఆధునీకరణ వ్యాపారం చేపట్టింది. వచ్చే 7-10 సంవత్సరాల్లో...

రూ.5,000 కోట్ల వ్యాపార లక్ష్యం

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి ప్రవేశించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా విమానాలు, హెలికాప్టర్ల ఆధునీకరణ వ్యాపారం చేపట్టింది. వచ్చే 7-10 సంవత్సరాల్లో ఈ కొత్త వ్యాపారం ద్వారా రూ.5,000 కోట్ల ఆదాయం ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే జెనిసిస్‌ అనే అమెరికా కంపెనీతో పొత్తు పెట్టుకుని 55 డోర్నియర్‌-228 విమానాల ఆధునీకరించి రూ.350 కోట్లు సంపాదించింది. వీటి పనితీరుపై భారత వైమానిక, నౌకా దళాలు, తీర ప్రాంత గస్తీ దళాలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. మన దేశానికి చెందిన ఒక ప్రైవేటు కంపెనీ సొంతంగా విమానాల ఆధునీకరణ రంగంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

భారీ అవకాశం: సాధారణంగా విమానాలు, హెలికాప్టర్ల జీవిత కాలం 30 నుంచి 40 సంవత్సరాలు. అయితే కాలానికి అనుగుణంగా మధ్యలో వీటిలో ఉండే కీలక పరికరాలను మార్చాల్సి ఉంటుంది. వీటి ఖర్చులు విమానం లేదా హెలికాప్టర్‌ కొన్న ధర కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా వీటిని తయారు చేసే కంపెనీలు లేదా ఎంఆర్‌ఓ సంస్థలు ఈ పని చేస్తుంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సైనిక విమానాలు, హెలికాప్టర్ల ఆధునీకరణ వ్యాపారమే ఏటా రూ.5 లక్షల కోట్ల వరకు ఉంది. వచ్చే ఏడేళ్లలో ఇది రూ.7 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. మన దేశంలోనూ పౌర, సైనిక విమానాలు, హెలికాప్టర్ల సంఖ్య పెరుగుతోంది. ముందు ముందు ఇది పెద్ద వ్యాపార అవకాశం అవుతుందని రిలయన్స్‌ గ్రూప్‌ భావిస్తోంది.

ఇవీ చదవండి:

దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 05:57 AM