ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Real Estate Sales Drop: ఇళ్ల అమ్మకాలు కిందికి

ABN, Publish Date - Jul 04 , 2025 | 05:15 AM

శంలో ఇళ్ల అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 1,70,201 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే...

  • ధరలు మాత్రం పైపైకి..

  • హైదరాబాద్‌ రియల్టీ అదుర్స్‌

  • నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా

న్యూఢిల్లీ: దేశంలో ఇళ్ల అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 1,70,201 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 2 శాతం తగ్గాయని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. అమ్మకాలు తగ్గినా ఇళ్ల ధరలు మాత్రం సగటున 2 నుంచి 14 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో ఈ ఎనిమిది నగరాల్లో కంపెనీలు లీజుకు తీసుకున్న ఆఫీస్‌ స్పేస్‌ విస్తీర్ణం 41ు పెరిగి 489 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ చేరింది.

హైదరాబాద్‌ రియల్టీలో జోరు: గత ఆరు నెలల్లో హైదరాబాద్‌ రియల్టీలో మాత్రం మంచి వృద్ధి రేటు కనిపించింది. గత ఆరు నెలల్లో నగరం, దాని చుట్టుపక్కల 19,048 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ. ఇదే సమయంలో ధరలు 11 శాతం వరకు పెరిగాయి. కార్యాలయ భవనాల లీజుల విషయంలోనూ ఇదే పరిస్థితి. గత ఆరు నెలల్లో హైదరాబాద్‌లో 59 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. ఇదే సమయంలో నెలవారీ ఎస్‌ఎ్‌ఫటీ లీజు రెంటల్స్‌ సగటున 10 శాతం పెరిగి రూ.75కు చేరాయి.

  • జూన్‌ ముగిసే నాటికి హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్లు, ఫ్లాట్ల సంఖ్య 54,458గా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ.

  • రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు యమ గిరాకీ

  • రూ.కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య ధర ఉన్న లగ్జరీ ఇళ్లకూ గిరాకీ

ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 05:15 AM