ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Re Sustainability: నెట్ జీరో లక్ష్యాల సాధనకు ‘ఇంటిగ్రేటెడ్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్’ ప్రారంభం

ABN, Publish Date - May 14 , 2025 | 10:46 PM

భారతీయ వ్యాపార రంగంలో సుస్థిరతను సమూలంగా మార్చేందుకు రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ReSL) వినూత్నమైన వేదికను ప్రారంభించింది.

హైదరాబాద్: భారతీయ వ్యాపార రంగంలో సుస్థిరతను సమూలంగా మార్చేందుకు రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ReSL) వినూత్నమైన వేదికను ప్రారంభించింది. ‘ఇంటిగ్రేటెడ్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్’ (ISS) పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక వేదిక, నెట్ జీరో, ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, పాలన), వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) వంటి లక్ష్యాలను చేరుకోవడానికి భారతీయ పరిశ్రమలకు సమగ్ర సహాయం అందిస్తుంది. పర్యావరణ, సుస్థిరత్వ పరిష్కారాలలో ఆసియాలోనే అగ్రగామిగా ఉన్న రీ సస్టైనబిలిటీ, వ్యాపారాలు తమ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి వ్యూహాలలో సుస్థిరత్వాన్ని పూర్తిగా అనుసంధానం చేసేలా ఈ వేదికను తీర్చిదిద్దింది. గతంలో సమర్థవంతమైన సుస్థిరత్వ అమలుకు అడ్డంకిగా నిలిచిన సమస్యలను ISS సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. ఇకపై వివిధ అవసరాల కోసం వేర్వేరు విక్రేతలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, వ్యాపారాలు తమ సుస్థిరత్వ ప్రణాళికను అమలు చేయడానికి ఒకే విశ్వసనీయ భాగస్వామిపై ఆధారపడవచ్చు. ఈ వేదిక ద్వారా ప్రారంభ వ్యూహ రచన, నియంత్రణ సమస్యల పరిష్కారం నుండి మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరుల పునరుద్ధరణ, కార్యకలాపాల నిర్వహణ, ఈఎస్‌జీ నివేదికల తయారీ వరకు అన్ని రకాల సేవలు ఒకే చోట లభిస్తాయి. 11 దేశాలలో 99కు పైగా కార్యాలయాలు మరియు భారతదేశంలోని అతిపెద్ద పర్యావరణ నిపుణుల బృందం ISSకు మద్దతునిస్తున్నాయి.


ISS ద్వారా అందించే ముఖ్యమైన సేవలు:

  • సుస్థిరత్వం, ఈఎస్‌జీకి సంబంధించిన సలహాలు, అనుమతులు

  • పర్యావరణపరమైన సమగ్ర పరిశీలన (డ్యూ డిలిజెన్స్), పరిష్కార సేవలు

  • పర్యావరణ మౌలిక సదుపాయాల పరిష్కారాలు

  • కార్యాచరణ, నిర్వహణ సహకారం

  • డీకార్బనైజేషన్, వాతావరణ చర్యల అమలు

  • వనరుల పునరుద్ధరణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ పరిష్కారాలు

  • సుస్థిరత్వ నివేదికల తయారీ, హామీ

  • డిజిటల్ మరియు విశ్లేషణ సాధనాల లభ్యత

  • సుస్థిరమైన ఫైనాన్సింగ్, డెలివరీ నమూనాలు

ఈ సందర్భంగా రీ సస్టైనబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ మసూద్ మాలిక్ మాట్లాడుతూ... "అనేక కంపెనీలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత కార్యక్రమాలను అమలు చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ISS అనే ఈ నూతన వేదిక వారికి ఒకే చోట సమగ్రమైన సలహా, అమలు, పర్యవేక్షణ సేవలను అందిస్తోంది. దీని ద్వారా కంపెనీలు తమ నిర్దేశిత లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండవచ్చు. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవచ్చు" అని పేర్కొన్నారు.


స్థిర వృద్ధి కోసం యూటీఐ

మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మీ పెట్టుబడికి స్థిరమైన వృద్ధిని ఆశిస్తున్న వారి కోసం యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ సరైన ఎంపికని సంస్థ తెలిపింది. బలమైన వ్యాపారాలు కలిగిన పెద్ద, మధ్య తరహా కంపెనీల షేర్లను వాటి నిజమైన విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలనే విలువ ఆధారిత పెట్టుబడి సూత్రాన్ని ఈ ఫండ్ అనుసరిస్తోంది. సెబీ నియమాల ప్రకారం, లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 35 శాతం లార్జ్ క్యాప్ కంపెనీల్లోనూ, మరో 35 శాతం మిడ్ క్యాప్ కంపెనీల్లోనూ పెట్టుబడి పెట్టాలి. యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్ షేర్లపై ఎక్కువ దృష్టి పెడుతూనే, అధిక వృద్ధి అవకాశాల కోసం మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లోనూ పెట్టుబడులు కొనసాగిస్తుంది. విలువ ఆధారిత పెట్టుబడి అనేది తక్కువ విలువ కలిగిన షేర్లను గుర్తించి పెట్టుబడి పెట్టే ఒక పద్ధతి. కొన్నిసార్లు మార్కెట్లు తాత్కాలిక అంశాలకు ఎక్కువగా స్పందించినప్పుడు, మంచి కంపెనీల షేర్లు కూడా వాటి అసలైన విలువ కంటే తక్కువ ధరకు లభిస్తాయి. ఇలాంటి సమయాల్లో విలువ ఆధారిత పెట్టుబడిదారులు వాటిని కొనుగోలు చేస్తారు. తక్కువ ధరకు కొనడం వల్ల నష్టపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందితే మంచి లాభాలు పొందవచ్చు. విలువ ఆధారిత పెట్టుబడిదారులు వృద్ధి కంటే పెట్టుబడి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. షేర్ల ధరలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని, కాలక్రమేణా వాటి సరైన విలువకు చేరుకుంటాయని వారు విశ్వసిస్తారు. కంపెనీ ప్రాథమిక అంశాలు బలపడినప్పుడు, విలువ ఆధారిత పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందుతారు. యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ సగటు విలువ కంటే తక్కువ ధరలో లభిస్తూ, భవిష్యత్తులో మంచి వృద్ధి అవకాశాలు ఉన్న రంగాలను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత బలమైన వ్యాపార నమూనా కలిగి, సరైన విలువలో ఉన్న కంపెనీలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఆ కంపెనీల గత పనితీరు, భవిష్యత్తు వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి కంపెనీ విలువ మారుతూ ఉంటుందని, ఆర్థిక పరిస్థితులు లేదా ప్రత్యేక కారణాల వల్ల అది ప్రభావితమవుతుందని ఈ ఫండ్ భావిస్తుంది. ఇలాంటి మార్పుల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని లాభం పొందడమే ఈ ఫండ్ లక్ష్యమని సంస్థ తెలిపింది. మంచి విలువలతో ఉండి, వృద్ధిని నమోదు చేస్తున్న కంపెనీల పైనా ఈ ఫండ్ దృష్టి సారిస్తుంది.

Updated Date - May 14 , 2025 | 10:46 PM