ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pure EV: కెనడా సంస్థతో ప్యూర్ జట్టు..

ABN, Publish Date - May 16 , 2025 | 10:53 PM

తెలంగాణకు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖమైన ప్యూర్ సంస్థ, కెనడాకు చెందిన ఛార్జ్ పవర్ ఇంక్‌తో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్: తెలంగాణకు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖమైన ప్యూర్ సంస్థ, కెనడాకు చెందిన ఛార్జ్ పవర్ ఇంక్‌తో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్యూర్ తన ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను అమెరికా, కెనడా మార్కెట్లలోకి విడుదల చేయనుంది. ప్యూర్ తన 'ప్యూర్ పవర్' శ్రేణి ఉత్పత్తులను ఇకపై అమెరికా, కెనడా దేశాలకు ఎగుమతి చేయనుంది. అమెరికా మార్కెట్‌లో ప్రధానంగా గ్రిడ్ స్థాయి ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించనుండగా, కెనడాలో కమర్షియల్, ఇండస్ట్రియల్ (C&I) మరియు గ్రిడ్ స్థాయి అప్లికేషన్‌లపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ సహకారంతో ప్యూర్ అధునాతన ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్‌లు కెనడా, అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. రెండు సంస్థలు కలిసి తమ బ్రాండ్‌లను ప్రోత్సహించనున్నాయి. ప్యూర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ... ప్యూర్ పవర్ అనేది ఎనిమిది సంవత్సరాల నిరంతర కృషి ఫలితమన్నారు.


ఇప్పటికే గృహ, వాణిజ్య, భారీ పరిశ్రమల్లో అనేక ఉత్పత్తులు విజయవంతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో తమకున్న లోతైన అనుభవం, బలమైన ఉత్పత్తి సామర్థ్యాలతో తమ వినూత్నమైన, మన్నికైన, నమ్మకమైన ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులు అమెరికా, కెనడా మార్కెట్లలో విస్తృతమైన ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నార్త్ అమెరికాలో 4 గిగావాట్ల‌కు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసిన అనుభవం, ఈపీసీ, మార్కెటింగ్, సేల్స్‌లో బలమైన నైపుణ్యం కలిగిన ఛార్జ్ పవర్‌తో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇరు సంస్థల బలాలు, సామర్థ్యాలను ఉపయోగించి రాబోయే నెలల్లో ఈ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్కెట్లు తమ ప్రపంచ విస్తరణ వ్యూహంలో కీలకమైన భాగమని ఆయన పేర్కొన్నారు.


పాలసీదారులకు బోనస్..

బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ పాలసీదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో రూ. 1,833 కోట్ల బోనస్‌ను అందించనుంది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక బోనస్. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రకటించిన రూ. 1,383 కోట్లతో పోలిస్తే ఈసారి 32 శాతం ఎక్కువ బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 11.71 లక్షల మంది పాలసీదారులు లబ్ధి పొందనున్నారు.

Updated Date - May 16 , 2025 | 10:53 PM