ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లో లాభాల స్వీకరణ

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:01 AM

లాభాల స్వీకరణ అమ్మకాలు బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను దెబ్బతీశాయి. జూలై 9 నుంచి సుంకాల అమలు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే...

ముంబై: లాభాల స్వీకరణ అమ్మకాలు బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను దెబ్బతీశాయి. జూలై 9 నుంచి సుంకాల అమలు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే భయం కూడా మార్కెట్‌ను వెంటాడింది. దీంతో సెన్సెక్స్‌ 287.60 పాయింట్ల నష్టంతో 83,409.69 వద్ద ముగియగా నిఫ్టీ 88.40 పాయింట్ల నష్టంతో 254,453.40 వద్ద క్లోజయింది. ఎఫ్‌పీఐల అమ్మకాలకు తోడు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో లాభాల స్వీకరణ అమ్మకాల ఒత్తిడి బుధవారం మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి.

హెచ్‌డీబీ ఫైనాన్స్‌ శుభారంభం: ఇటీవల ఐపీఓకు వచ్చిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కంపెనీ షేర్లు బుధవారం లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.740పై 12.83 శాతం లాభంతో రూ.835 వద్ద బీఎ్‌సఈలో లిస్టయిన ఈ కంపెనీ షేర్లు ఇంట్రా డేలో 14.92 శాతం లాభంతో రూ.850.45ని తాకాయి. చివరికి 13.63 శాతం లాభంతో రూ.840.90 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ షేర్ల మార్కెట్‌ విలువ రూ.69,758 కోట్లకు చేరింది.

చారిత్రాత్మకమైన రోజు : తమ అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కంపెనీ లిస్టింగ్‌ను హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు చారిత్రాత్మకమైన రోజుగా బ్యాంకు ఎండీ, సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 05:01 AM