Plasto Tank Stand: ఆర్‌సీ ప్లాస్టో నుంచి ట్యాంక్ స్టాండ్
ABN, Publish Date - Aug 13 , 2025 | 01:34 AM
వాటర్ స్టోరేజీ సొల్యూషన్స్ సంస్థ ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ లిమిటెడ్.. మార్కెట్లోకి ప్లాస్టో ట్యాంక్ స్టాండ్‌ను తీసుకువచ్చింది. వాటర్ ట్యాంకుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఈ స్టాండ్‌లను డిజైన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది...
హైదరాబాద్: వాటర్ స్టోరేజీ సొల్యూషన్స్ సంస్థ ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ లిమిటెడ్.. మార్కెట్లోకి ప్లాస్టో ట్యాంక్ స్టాండ్‌ను తీసుకువచ్చింది. వాటర్ ట్యాంకుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఈ స్టాండ్‌లను డిజైన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. సాంప్రదాయ సిమెంట్ స్టాండ్స్‌తో ట్యాంక్ పగిలిపోవటం, నీరు లీకేజీ కావటంతో పాటు ట్యాంక్ చుట్టుపక్కల చెత్తా చెదారం పేరుకుపోతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వంద శాతం ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌తో ప్లాస్టో ట్యాంక్ స్టాండ్‌ను డిజైన్ చేసినట్లు తెలిపింది. ఏడు అంగుళాల ఎత్తుతో కూడిన ఈ స్టాండ్‌తో ట్యాంక్ కింది భాగంపై ఎలాంటి ఒత్తిడి పడదని పేర్కొంది. అంతేకాకుండా ట్యాంక్ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచవచ్చని తెలిపింది. పదేళ్ల వారంటీతో కూడిన ఈ స్టాండ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్లాస్టో డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని ఆర్‌సీ ప్లాస్టో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 13 , 2025 | 01:34 AM