ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారా

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:16 AM

ప్రస్తుత ప్రపచంలో ఎక్కువ మంది అప్పుల అప్పారావులే. ఖర్చులు ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఎవరైనా అప్పులు చేయక తప్పదు. ఆరోగ్య బీమా లేకుండా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు...

ఈ నిబంధనలు తెలుసుకోండి..

ప్రస్తుత ప్రపచంలో ఎక్కువ మంది అప్పుల అప్పారావులే. ఖర్చులు ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఎవరైనా అప్పులు చేయక తప్పదు. ఆరోగ్య బీమా లేకుండా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఇంటి రిపేర్లు, లేదా ఇతర అత్యవసర ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పదు. ఈ రోజుల్లో చేబదులు ఇచ్చే వాళ్లు తక్కువ. అప్పుడు వ్యక్తిగత రుణాలే గతి.

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎ్‌ఫసీ) నుంచి వ్యక్తిగత (పర్సనల్‌) రుణాలు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతోంది. కొద్దిగా రిస్క్‌ ఉన్నా వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువగా ఉండడంతో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు కూడా ఈ రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో దాదాపు 36 శాతం ఈ రుణాలే. దీన్ని బట్టి బ్యాంకులు కూడా ఈ రుణాలపై ఎంత ఆసక్తితో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని అర్హతలకు లోబడి మాత్రమే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఈ రుణాలు ఇస్తాయి. ఆ అర్హతలు ఏమిటో తెలుసుకుందాం.

రుణ అర్హతలు: వ్యక్తిగత రుణాల మంజూరుకు ప్రతి బ్యాంకు, ఎన్‌బీఎ్‌ఫసీ కొన్ని నిబంధనలు పాటిస్తుంది. ఈ అర్హతలు ఆయా సంస్థలను బట్టి వేరు వేరుగా ఉంటాయి. అయితే అన్ని సంస్థలు రుణం తీసుకునే వ్యక్తి కనీస ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, వయసు, చేస్తున్న ఉద్యోగం, తీసుకునే రుణాన్ని ఎంత కాలంలో చెల్లిస్తాడు? అనే విషయాలను తప్పనిసరిగా చూస్తాయి. పై విషయాల ఆదారంగా వ్యక్తిగత రుణం తీసుకున్న వ్యకికి ఎంత రుణం మంజూరు చేయవచ్చు? ఆ రుణం తీసుకున్న వ్యక్తి ఆ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించగలడా? లేదా? అనే అంశంపై బ్యాంకులు ఒక అవగాహనకు వస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఈ రుణాల మంజూరు ప్రక్రియను ఆన్‌లైన్‌ చేశాయి. ఆయా బ్యాంకుల వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ కేవైసీ వివరాలు, కావాల్సిన ఈఎంఐ ప్లాన్‌ ఎంటర్‌ చేస్తే వ్యక్తిగత రుణ మంజూరుకు మీకు అర్హత ఉన్నదీ, లేనిదీ బ్యాంకులు వీలైనంత త్వరగా తెలియజేస్తాయి. ఈ రుణాల కనీస వడ్డీ 10.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

ప్రధాన అర్హతలు

  • 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి

  • కనీస క్రెడిట్‌ స్కోర్‌ 700 పైన ఉండాలి

  • ఉంటున్న నగరాన్ని బట్టి కనీస నెలవారీ ఆదాయం

  • ఎన్నాళ్ల నుంచి ఆయా సంస్థల్లో పని చేస్తున్నారు

  • స్వయం ఉపాధా లేక ఉద్యోగమా?

  • ఇతర రుణాల చెల్లింపు భారమేమైనా ఉందా లేదా అనే అంశం

తెలుసుకోవడం ఎలా?

వ్యక్తిగత రుణాలకు మనకు అర్హత ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అనేక ఫ్రీ టూల్స్‌ ఉన్నాయి. ఆ వెబ్‌సైట్లలోకి లాగిన్‌ అయి మీ వయసు, ఆదాయం, ఉద్యోగం, ఇప్పటికే ఉన్న అప్పుల వంటి వివరాలు నమోదు చేస్తే చాలు. మీరు ఎంత వ్యక్తిగత రుణానికి అర్హులో వెంటనే తెలిసిపోతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 04:16 AM