ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pitty Engineering: రూ 150 కోట్లతో పిట్టీ ఇంజనీరింగ్‌ విస్తరణ

ABN, Publish Date - Aug 08 , 2025 | 05:42 AM

వృద్ధి అవకాశాలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతున్నట్లు పిట్టీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. రూ.150 కోట్ల పెట్టుబడితో పిట్టీ ఇంజనీరింగ్‌ ప్లాంట్‌...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వృద్ధి అవకాశాలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతున్నట్లు పిట్టీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. రూ.150 కోట్ల పెట్టుబడితో పిట్టీ ఇంజనీరింగ్‌ ప్లాంట్‌ విస్తరణతో పాటు అనుబంధ సంస్థలైన పిట్టీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దక్షిణ్‌ ఫౌండ్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి కార్యకలాపాలు విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రతిపాదిత పెట్టుబడులతో ప్రస్తుతం 90,000 ఎంటీలుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,08,000 ఎంటీలకు పెంచటంతో పాటు ఫౌండ్రీ సామర్థ్యాలను 18,600 ఎంటీల నుంచి 24,000 ఎంటీలకు విస్తరించనున్నట్లు తెలిపింది. దశలవారీగా 18 నెలల్లో ఈ విస్తరణ కార్యకలాపాలను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.463.96 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.22.88 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 05:42 AM