4 లక్షల కోట్ల డాలర్లకు ఎన్‌విడియా మార్కెట్ క్యాప్
ABN, Publish Date - Jul 10 , 2025 | 05:38 AM
అమెరికా టెక్ దిగ్గజం ఎన్‌విడియా షేర్లు స్టాక్‌మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. బుధవారం కంపెనీ షేర్లు 2.5 శాతం లాభంతో 164 డాలర్లకు చేరాయి...
న్యూయార్క్: అమెరికా టెక్ దిగ్గజం ఎన్‌విడియా షేర్లు స్టాక్‌మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. బుధవారం కంపెనీ షేర్లు 2.5 శాతం లాభంతో 164 డాలర్లకు చేరాయి. దీంతో కంపెనీ షేర్ల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో నాలుగు లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.342.6 లక్షల కోట్లు) చేరింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కంపెనీ షేర్ల మార్కెట్ క్యాప్ ఈ స్థాయికి చేరలేదు. 2023 ప్రారంభంలో 14 డాలర్ల వద్ద ట్రేడైన ఎన్‌విడియా షేర్లు ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) బూమ్‌తో 164 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రెండేళ్లలోనే ఎన్‌విడియా షేర్ల మార్కెట్ క్యాప్ 60,000 కోట్ల డాలర్ల నుంచి నాలుగు లక్షల కోట్ల డాలర్లకు చేరడం విశేషం.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 05:38 AM