Nifty Marketఫ 25,000 పైన నిలదొక్కుకోవడం అవశ్యం
ABN, Publish Date - Jun 23 , 2025 | 03:41 AM
నిఫ్టీ గత వారం ప్రారంభంలో కరెక్షన్‌కు లోనై మానసిక అవధి 25,000 కన్నా దిగజారినా కోలుకుని వారం మొత్తం మీద 390 పాయింట్ల లాభంతో 25,110 వద్ద ముగిసింది. ఆరు వారాల కన్సాలిడేషన్, సైడ్‌వేస్ ధోరణి అనంతరం...
నిఫ్టీ గత వారం ప్రారంభంలో కరెక్షన్‌కు లోనై మానసిక అవధి 25,000 కన్నా దిగజారినా కోలుకుని వారం మొత్తం మీద 390 పాయింట్ల లాభంతో 25,110 వద్ద ముగిసింది. ఆరు వారాల కన్సాలిడేషన్, సైడ్‌వేస్ ధోరణి అనంతరం బ్రేకౌట్ సాధించినందు వల్ల 25,000 స్థాయిలో పుల్‌బ్యాక్ రియాక్షన్‌కు ఆస్కారం ఉంది. అప్‌ట్రెండ్‌ను కొనసాగించాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవడం అవసరం. మిడ్‌క్యాప్-100, స్మాల్‌క్యాప్-100 సూచీలు సైతం మద్దతు స్థాయిల కన్నా పైనే ఉన్నాయి. మార్కెట్ గత మూడు వారాల్లో మందకొడిగానే అయినప్పటికీ నిలకడగా అప్‌ట్రెండ్ సాధిస్తోంది. ఇటీవల ఏర్పడిన టాప్ 25,200కి చేరువలో ఉంది. అయితే అమెరికన్ మార్కెట్లలో బలహీన ట్రెండ్ కారణంగా ఈ వారంలో అప్రమత్తంగా ప్రారంభం కావచ్చు.
బుల్లిష్ స్థాయిలు: ప్రపంచ మార్కెట్లలో బలహీన ట్రెండ్ ప్రభావంతో రియాక్షన్‌తో ప్రారంభమైనా సానుకూలత కోసం 25,000 వద్ద బౌన్స్ బ్యాక్ సాధించాలి. ప్రధాన నిరోధం 25,200. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కొనసాగుతుంది.
బేరిష్ స్థాయిలు: 25,000 వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగే ప్రమాదం ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 24,750. ఇక్కడ కూడా విఫలమైతే అప్రమత్తం కావాలి. మరో ప్రధాన మద్దతు స్థాయి 24,500.
బ్యాంక్ నిఫ్టీ: వరుసగా నాలుగు రోజుల పాటు సైడ్‌వేస్‌లో కదలాడిన ఈ సూచీ శుక్రవారం బలమైన ర్యాలీలో పురోగమించి 725 పాయింట్లు లాభపడింది. ప్రధాన నిరోధ స్థాయిలు 56,000, 57,000. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది. బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 56,000 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.
పాటర్న్: మరింత అప్‌ట్రెండ్ కోసం 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఇక్కడ నాలుగు టాప్ పాటర్న్‌లు ఏర్పడినందు వల్ల ఈ స్థాయిలో నిలదొక్కుకోవడం కీలకం.
టైమ్ : ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం: 25,200, 25,120
మద్దతు : 24,950, 24,800
Updated Date - Jun 23 , 2025 | 03:41 AM