ఈ వారం నిలదొక్కుకుంటేనే!
ABN, Publish Date - Apr 21 , 2025 | 02:28 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారి్‌ఫ్సకు విరామం ప్రకటించటంతో గత వారం దుమ్ము రేపిన మార్కెట్లు ఈ వారం పుంజుకుంటే నిలదొక్కుకున్నట్టే. ఇక ప్రపంచ మార్కెట్లతో...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారి్‌ఫ్సకు విరామం ప్రకటించటంతో గత వారం దుమ్ము రేపిన మార్కెట్లు ఈ వారం పుంజుకుంటే నిలదొక్కుకున్నట్టే. ఇక ప్రపంచ మార్కెట్లతో సంబంధం లేకుండా దేశీయ మార్కెట్లు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐటీ, ఇన్‌ఫ్రా, మెటల్స్, ఆటోమొబైల్ యాన్సిలరీ రంగాల షేర్లు బలహీనంగా ఉన్నా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఏవియేషన్, షిప్ బిల్డింగ్, టెలికాం రంగ షేర్లు బుల్లి్‌షగా ఉన్నాయి. నిఫ్టీ 23,850 ఎగువన నిలదొక్కుకోవటం కీలకం. అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
ఎన్‌టీపీసీ గ్రీన్: గత డిసెంబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం ఐపీఓ స్థాయి వద్ద కదలాడుతోంది. మంచి బేస్ ఏర్పడింది. మూమెంటమ్, డెలివరీ వాల్యూమ్ క్రమంగా పెరుగుతోంది. గత గురువారం రూ.108 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.100/105 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.135/145 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.95 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
గుజరాత్ గ్యాస్ లిమిటెడ్: గత ఏడాది ఆగస్టు నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లోనే పయనిస్తోంది. ఫిబ్రవరి నుంచి మంచి బేస్ ఏర్పడింది. టర్న్ అరౌండ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 10,20 రోజుల మూవింగ్ యావరేజెస్ పైనే కదలాడుతోంది. గత గురువారం రూ.445 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.440/430 వద్ద ప్రవేశించి రూ.520/550 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.410 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ప్రీమియర్ ఎనర్జీస్: గత ఏడాది సెప్టెంబరులో మార్కెట్లో లిస్టయిన ఈ షేరు డిసెంబరులో జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత క్రమంగా డౌన్‌ట్రెండ్‌లోకి జారుకుంది. లిస్టింగ్ అయిన రూ.880 శ్రేణిలోనే చక్కని బేస్ ఏర్పడింది. చివరి ఐదు సెషన్లలో జోరు ప్రదర్శించిన ఈ షేరు మరింత పటిష్ఠతను సూచిస్తోంది. గత గురువారం రూ.967 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.950 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.915 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: గత ఏడాది జూలై నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా జనవరి నాటి గరిష్ఠాన్ని బ్రేక్ చేసింది. రిలేటివ్ స్ట్రెంత్, మూమెంటమ్ క్రమంగా పెరుగుతోంది. గత గురువారం రూ.604 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.600 శ్రేణిలో ఎంటరై రూ.660/680 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.585 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆదిత్య బిర్లా క్యాపిటల్: ప్రస్తుతం ఈ షేరు చక్కని మూమెంటమ్‌తో దూసుకుపోతోంది. డౌన్‌ట్రెండ్ నుంచి ఫిబ్రవరిలోనే టర్న్ అరౌండ్ అయ్యింది. పైగా చక్కని రిస్క్ రివార్డు రేషియోతో అందుబాటులో ఉంది. గత గురువారం రూ.198 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.195 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.220/230 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.190 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 21 , 2025 | 02:28 AM