ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టెక్‌ వ్యూ 25,000 పైన నిలకడ తప్పనిసరి

ABN, Publish Date - May 26 , 2025 | 05:46 AM

నిఫ్టీ గత వారం తీవ్ర ఊగిసలాటల మధ్యన ట్రేడయి 24,850 వద్ద ముగిసింది. గత కొద్ది వారాలుగా 25,000 స్థాయిలో సైడ్‌వేస్‌, ఆటుపోట్ల ధోరణిలో ట్రేడవుతోంది. గత రెండు వారాలుగా 25,000 స్థాయిలో ఎన్నో రియాక్షన్లు సాధిస్తున్నప్పటికీ...

టెక్‌ వ్యూ : 25,000 పైన నిలకడ తప్పనిసరి

నిఫ్టీ గత వారం తీవ్ర ఊగిసలాటల మధ్యన ట్రేడయి 24,850 వద్ద ముగిసింది. గత కొద్ది వారాలుగా 25,000 స్థాయిలో సైడ్‌వేస్‌, ఆటుపోట్ల ధోరణిలో ట్రేడవుతోంది. గత రెండు వారాలుగా 25,000 స్థాయిలో ఎన్నో రియాక్షన్లు సాధిస్తున్నప్పటికీ దిగువ స్థాయిల్లో పునరుజ్జీవం కూడా సాధిస్తోంది. ఇది పాజిటివ్‌ ట్రెండ్‌ సంకేతం. ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ పాజిటివ్‌గానే ఉంది. ఈ వారంలో మార్కెట్‌ అప్రమత్తంగా ప్రారంభమై కీలక మానసిక అవధి 25,000 స్థాయిలో పరీక్ష ఎదుర్కొనవచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: గత వారం మార్కెట్లో కదలికలు పరిమిత పరిధిలోనే ఉన్నాయి. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ మరింతగా కొనసాగించాలంటే ఈ వారంలో 25,000 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఆ పైన మరో నిరోధం 25,250.

బేరిష్‌ స్థాయిలు: బలహీనతకు లోనైనా మైనర్‌ మద్దతు స్థాయి 24,700 వద్ద నిలదొక్కుకుని తీరాలి. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 24,500. గత వారం ఇక్కడే మద్దతు తీసుకున్నందు వల్ల ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశించే ముప్పు ఏర్పడుతుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత ఐదు వారాలుగా కీలక స్థాయి 55,000 వద్ద సైడ్‌వేస్‌ ధోరణి ప్రదర్శించింది. అయితే గత వారం కేవలం 45 పాయింట్ల లాభంతో 55,400 వద్ద ముగిసింది. తదుపరి నిరోధం 55,700. ప్రధాన నిరోధం 56,100 (ఆల్‌టైమ్‌ గరిష్ఠం). ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ప్రస్తుత మద్దతు స్థాయి 55,000 వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది.


పాటర్న్‌: గత రెండు వారాల్లో 25,000 స్థాయిలో డబుల్‌ టాప్‌ పాటర్న్‌ ఏర్పడడం సానుకూల సంకేతం. గత వారంలో మార్కెట్‌ 25 డీఎంఏ కన్నా పైన నిలదొక్కుకుంది. ప్రస్తుతం 25,000 స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు. అలాగే ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్‌కు కూడా ఆస్కారం ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24940, 25000

మద్దతు : 24770, 24700

వి. సుందర్‌ రాజా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి


Updated Date - May 26 , 2025 | 05:46 AM