విదేశీ కంపెనీలు ఉత్పత్తికి సై అంటే దిగుమతి సుంకం 15 శాతమే
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:55 AM
దేశీయంగా విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీకి ముందుకు వచ్చే విదేశీ కంపెనీలకు దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈవీల స్థానిక తయారీని పటిష్ఠం చేయడం, ప్రపంచ...
8,000 ఈవీలకు మాత్రమే అనుమతి
దేశీయ తయారీపై కనీస పెట్టుబడి రూ.4,150 కోట్లు ఉండాలి
కొత్త ఈవీ పాలసీ మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీకి ముందుకు వచ్చే విదేశీ కంపెనీలకు దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈవీల స్థానిక తయారీని పటిష్ఠం చేయడం, ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం లక్ష్యంగా రూపొందించిన కొత్త ఈవీ విధానం మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం నోటిఫై చేసింది. దీంతో ఈ పాలసీ ఇప్పుడు అమలులోకి వచ్చినట్టవుతుంది. దాని ప్రకారం ఈవీల తయారీలో కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆటో తయారీదారులను 15ు తగ్గింపు సుంకంపై 8,000 ఈవీలు దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తారు. అయితే అనుమతులు పొందిన తేదీ నుంచి మూడు సంవత్సరాల్లోగా ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు తయారీలో ఎంత శాతంలో స్థానిక ఉత్పత్తులు వినియోగించేది ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా రెండు వారాల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటవుతుందని, 120 రోజులు అది అందుబాటులో ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత కూడా వచ్చే ఏడాది మార్చి 15 వరకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు దరఖాస్తుల విభాగాన్ని తెరిచే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కింద ఒక్కో దరఖాస్తుదారునిపై కోల్పోయే సుంకాల గరిష్ఠ పరిమితి రూ.6,484 కోట్లుగా ఉండనుందన్నారు.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 03 , 2025 | 04:55 AM