ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mukesh Ambani: కొత్త వ్యాపారాలే చోదక శక్తులు

ABN, Publish Date - Aug 08 , 2025 | 05:49 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వ్యాపార స్వరూపం మారిపోతోంది. ఇప్పటి వరకు పెట్రో కెమికల్స్‌, చమురు, గ్యాస్‌ ఉత్పత్తి, వాటి రిఫైనింగ్‌.. కంపెనీ వ్యాపారాలకు ప్రధాన ఆధారం. ముందు ముందు రిటైల్‌, డిజిటల్‌ సేవలు...

4 రంగాలపై రిలయన్స్‌ నజర్‌

  • 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో జియో

  • ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వ్యాపార స్వరూపం మారిపోతోంది. ఇప్పటి వరకు పెట్రో కెమికల్స్‌, చమురు, గ్యాస్‌ ఉత్పత్తి, వాటి రిఫైనింగ్‌.. కంపెనీ వ్యాపారాలకు ప్రధాన ఆధారం. ముందు ముందు రిటైల్‌, డిజిటల్‌ సేవలు, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొత్త తరహా ఇంధన వ్యాపారాలు కంపెనీ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులు కానున్నాయి. తాజా వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించిన రాసిన ముందు మాటలో ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ విషయం వెల్లడించారు. ఇదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్‌ఐఎల్‌ డీప్‌ టెక్‌ కంపెనీగా రూపాంతరం చెందుతుందన్నారు. ఇందుకోసం దాదాపు వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు కృత్రిమ మేథ (ఏఐ), పునరుత్పాదక ఇంధన వనరులు, అధునాతన లోహాల అభివృద్ధి, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కోసం పని చేస్తున్నట్టు వెల్లడించారు. వీరు అభివృద్ధి చేసిన ప్రతి టెక్నాలజీని ఆర్‌ఐఎల్‌కు చెందిన ప్రతి వ్యాపార విభాగంలో భాగం చేస్తామన్నారు. అంతర్జాతీయ టెలికాం రంగంలో ప్రధాన శక్తిగా ఎదిగేందుకు ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ఆరో తరం (6జీ) టెలికాం టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్టు అంబానీ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు.. తమ చర్యలన్నీ భారత్‌ను తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగానే ఉంటాయన్నారు. కొత్త వ్యాపారాలతో పాటు పాత వ్యాపారాలైన పెట్రో కెమికల్స్‌, రిఫైనింగ్‌ రంగాలపైనా తమ దృష్టి కొనసాగుతుందని అంబానీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 05:49 AM