ఎన్‌సీసీ లాభం రూ 254 కోట్లు
ABN, Publish Date - May 16 , 2025 | 04:31 AM
ఎన్‌సీసీ లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.6.189.36 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.253.82 కోట్ల నికర లాభాన్ని...
ఒక్కో షేరుకు 110% డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎన్‌సీసీ లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.6.189.36 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.253.82 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.22,354.91 కోట్ల ఆదాయంపై రూ.819.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.20 (110 శాతం) డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.32,888 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో ఆర్డర్ బుక్ రూ.71.568 కోట్లకు చేరుకుందని ఎన్‌సీసీ వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 16 , 2025 | 04:31 AM