ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నాట్కో ఫార్మా లాభం రూ 406 కోట్లు

ABN, Publish Date - May 29 , 2025 | 02:24 AM

నాట్కో ఫార్మా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.406 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన రూ.386.3 కోట్లతో...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.406 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన రూ.386.3 కోట్లతో పోలిస్తే ఇది ఐదు శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.1,287.3 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే క్యూ4లో కంపెనీ స్థూల లాభం 10.2 శాతం వృద్ధితో రూ.548 కోట్లుగా నమోదైంది. అయితే ఇదే సమయంలో నిర్వహణ లాభాలు మాత్రం 46.55 శాతం నుంచి 44.89 శాతానికి పడిపోయాయి.

ఆర్థిక సంవత్సరం మొత్తానికి : 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.4,784 కోట్ల ఆదాయంపై రూ.1,883.4 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25లో ఆదా యం 16 శాతం పెరిగితే, నికర లాభం ఏకంగా 36 శాతం పెరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) అంత ఆశాజనకంగా ఉండక పోవచ్చని కంపెనీ హెచ్చరించింది. కంపెనీ ఆదాయం 20 శాతం, నికర లాభం 30 శాతం వరకు క్షీణించే ప్రమాదం ఉందని తెలిపింది. అమెరికా మార్కెట్‌లో ఎదురవుతున్న ధరల ఒత్తిడి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్‌ అండ్‌ డీ ఖర్చులు పెరిగిపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో బీఎ్‌సఈలో కంపెనీ షేర్లు బుదవారం 1.78 శాతం నష్టం తో రూ.862.45 వద్ద ముగిశాయి.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 02:57 PM