ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రికార్డు స్థాయికి ఫండ్‌ ఆస్తులు

ABN, Publish Date - May 20 , 2025 | 03:30 AM

గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) రంగ మొత్తం ఆస్తులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా లేదా 23 శాతం వృద్ధి చెంది సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి...

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23% వృద్ధితో రూ.65.74 లక్షల కోట్లకు చేరిక

  • యాంఫీ వార్షిక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) రంగ మొత్తం ఆస్తులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా లేదా 23 శాతం వృద్ధి చెంది సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.65.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈక్విటీ, డెట్‌ మార్కెట్లు మంచి ప్రతిఫలాలు అందిస్తున్న నేపథ్యంలో మదుపర్లు సమృద్ధిగా పెట్టుబడులు పెట్టడం, మార్క్‌ టు మార్కెట్‌ గెయిన్స్‌ (ఎంటీఎం) ఇందుకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి నాటికి ఫండ్‌ ఆస్తులు రూ.53.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ-50 టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌) 6 శాతంగా, సెన్సెక్స్‌ టీఆర్‌ఐ 5.9 శాతంగా నమోదైందని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) సోమవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతేకాదు, గతసారి ఫండ్ల పథకాల్లోకి నికరంగా రూ.8.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 03:30 AM