మే నెల జీఎస్‌టీ వసూళ్లు రూ 2 01 లక్షల కోట్లు
ABN, Publish Date - Jun 02 , 2025 | 02:57 AM
జీఎస్‌టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. గత నెల (మే)లో జీఎ్‌సటీ వసూళ్లు రూ.2.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన రూ.1,72,739 కోట్లతో పోలిస్తే ఇది 16.4 శాతం ఎక్కువ...
ఏపీలో రూ.3,803 కోట్లు, తెలంగాణలో రూ.5,310 కోట్లు
న్యూఢిల్లీ: జీఎ్‌సటీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. గత నెల (మే)లో జీఎ్‌సటీ వసూళ్లు రూ.2.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన రూ.1,72,739 కోట్లతో పోలిస్తే ఇది 16.4 శాతం ఎక్కువ. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో వసూలైన రూ.2.37 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం ఇది రూ.36,000 కోట్లు తక్కువ. మే నెలలో వసూలైన రూ.2.01 లక్షల కోట్ల జీఎ్‌సటీలో రూ.35,434 కోట్లు సీజీఎ్‌సటీ రూపంలో, రూ.43,902 కోట్లు ఎస్‌జీఎ్‌సటీ రూపంలో, రూ.1.09 లక్షల కోట్లు ఐజీఎ్‌సటీ రూపంలో వసూలయ్యాయి. సెస్సు కింద మరో రూ.12.879 కోట్లు వసూలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో: గత నెల రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జీఎ్‌సటీ కింద రూ.9,113 కోట్లు వసూలయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.3,803 కోట్లు వసూలు కాగా, తెలంగాణ నుంచి రూ.5,310 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే తెలంగాణలో జీఎ్‌సటీ వసూళ్లు ఆరు శాతం పెరగ్గా, ఏపీలో రెండు శాతం తగ్గాయి.
ఇవీ చదవండి:
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 02:57 AM