మార్కెట్లో మూడో రోజూ నష్టాలే
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:30 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 82.79 పాయింట్లు కోల్పోయి 81,361.87 వద్దకు జారుకోగా...
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 82.79 పాయింట్లు కోల్పోయి 81,361.87 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 18.80 పాయింట్ల నష్టంతో 24,793.25 వద్ద ముగిసింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమవుతుండటం, తత్ఫలితంగా ముడిచమురు ధరలు ఎగబాకుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించడం ఇందుకు కారణమైంది. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికమైంది. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.77 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.64 శాతం క్షీణించాయి.
సాయి లైఫ్‌సైన్సె్‌సలో 6% వాటా విక్రయం
హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్ట్ డ్రగ్ రీసెర్చ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్‌లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ ఏషియా వాటా తగ్గించుకోనుంది. సాయి లైఫ్‌లో 6 శాతం వాటాకు సమానమైన 1.25 కోట్ల షేర్లను టీపీజీ ఏషియా బ్లాక్ డీల్స్ ద్వారా ఓపెన్ మార్కెట్లో విక్రయానికి పెట్టినట్లు తెలిసింది. షేరు కనీస ధరను రూ.710గా నిర్ణయించినట్లుగా సమాచారం. కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర కంటే 2.5 శాతం తక్కువ ఇది. తద్వారా టీపీజీ ఏషియాకు రూ.885 కోట్ల వరకు సమాకూరనుంది. సాయి లైఫ్ సైన్సె్‌సలో టీపీజీ ఏషియా ప్రస్తుతం 24.73 శాతం వాటా కలిగి ఉంది. బీఎ్‌సఈలో సాయి లైఫ్ షేరు గురువారం 1.26 శాతం క్షీణించి రూ.729.20 వద్ద ముగిసింది.
25న హెచ్‌డీబీ ఫైనాన్షియల్ ఐపీఓ
ప్రైమరీ మార్కెట్లో వచ్చేవారం పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ల సందడి పెరగనుంది. మూడు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.15,000 కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. అందులో సింహభాగం హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసె్‌సదే. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ అనుబంధ విభాగమైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ ఈ నెల 25న (బుధవారం) ప్రారంభమై 27న (శుక్రవారం) ముగియనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.12,500 కోట్లు సమీకరించనుంది. కాగా వచ్చే వారం పబ్లిక్ ఇష్యూల జాబితాలో ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ కల్పతరు లిమిటెడ్ సహా ఎల్లెన్‌బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ కూడా ఉన్నాయి. కల్పతరు ఐపీఓ ఈ నెల 24న (మంగళవారం) ప్రారంభమై 26న (గురువారం) ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ.1,590 కోట్లు సమీకరించనున్న ఈ కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.387-414గా నిర్ణయించింది. ఎల్లెన్‌బ్యారీ గ్యాసెస్ ఐపీఓ కూడా 24న మొదలై 26న ముగియనుంది. షేరు ధరను రూ.380-400గా నిర్ణయించింది.
Also Read:
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
For More Business News
Updated Date - Jun 20 , 2025 | 05:30 AM