Stock Targets 2025: బౌన్స్ బ్యాక్ అయితేనే
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:59 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. మార్కెట్లలో మళ్లీ బుల్ రన్ కొనసాగాలంటే ఇప్పటి స్థాయిలను అధిగమించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు మారుతుండటం, కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు...
దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. మార్కెట్లలో మళ్లీ బుల్ రన్ కొనసాగాలంటే ఇప్పటి స్థాయిలను అధిగమించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు మారుతుండటం, కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవటం, వడ్డీ రేట్ల కోతలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవటం నెగటివ్ సెంటిమెంట్‌కు దారితీస్తోంది. నిఫ్టీ 50 డీఎంఏ, 25,000 దిగువకు రావటం కలవరపెడుతోంది.
స్టాక్ రికమండేషన్స్
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్: తాజా గరిష్ఠం రూ.1,379 నుంచి స్వల్ప దిద్దుబాటుకు లోనైన ఈ కౌంటర్ ప్రస్తుతం మెరుగ్గా చలిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్, మూమెంటమ్ పెరుగుతోంది. పైగా ఫార్మా రంగ సూచీ బ్రేకౌట్ ఇచ్చింది. గత శుక్రవారం రూ.1,277 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,270/1,250 శ్రేణిలో ప్రవేశించి రూ,1350 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,225 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్: ఈ షేరు నష్టాల మార్కెట్లోనూ మెరుగ్గా రాణించింది. గత శుక్రవారం రూ.1,921 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ,1,900 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.2,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. బై ఆన్ డిప్స్ పద్ధతిలో కొనుగోలు చేయాలి. రూ.1,875 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టొరెంట్ ఫార్మా: ఈ కౌంటర్ అత్యంత బలాన్ని ప్రదర్శిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్, మూమెంటమ్ చాలా బాగున్నాయి. డెలివరీ వాల్యూమ్ క్రమంగా పెరుగుతోంది. పైగా జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. గత శుక్రవారం రూ.3,063 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.3,550/3,580 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.3,750 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,550 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఎస్‌బీఐ లైఫ్: ఆరు నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతోంది. కీలకమైన నిరోధ స్థాయికి చేరుకుంది. రిలేటివ్ స్ట్రెంత్ బాగుంది. గత శుక్రవారం రూ.1,832 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,800 శ్రేణిలో ప్రవేశించి రూ.1,920 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,770 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
సన్ ఫార్మా: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనించిన ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్ జోన్‌లో ఉంది. ప్రస్తుతం అనిశ్చితి తగ్గింది. మూమెంటమ్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1,699 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,660/1,680 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,800 టార్గెట్ ధరతో పొజిషన్ తీసుకోవాలి. అయితే రూ.1,640 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..
Updated Date - Jul 28 , 2025 | 01:59 AM