ఆచితూచి అడుగేయండి
ABN, Publish Date - Jun 02 , 2025 | 03:09 AM
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనం అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంది. దేశీయ జీడీపీ వృద్ది రేటు అంచనాలకు తగ్గట్టుగా ఉండటం సానుకూల అంశం. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు...
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనం అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంది. దేశీయ జీడీపీ వృద్ది రేటు అంచనాలకు తగ్గట్టుగా ఉండటం సానుకూల అంశం. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు మరింత పెంచుతామని ప్రకటించటం, ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలతో అనిశ్చితికి అవకాశం ఉంది. ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతున్న నిఫ్టీ 25,000 ఎగువన నిలదొక్కుకోవటం అత్యంత కీలకం. ఈవారం బ్యాంకింగ్, ఫైనాన్స్, రైల్వే వ్యాగన్స్, షిప్ బిల్డింగ్, ఫిన్‌టెక్ షేర్లు బుల్లి్‌షగా కనిపిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
జైడస్ లైఫ్‌సైన్సెస్: ఏడాది కాలంగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ కౌంటర్‌లో ఫిబ్రవరి నుంచి మంచి బేస్ ఏర్పడింది. అక్యుములేషన్ కొనసాగుతోంది. ప్రైస్ యాక్షన్ టైట్‌గా కనిపిస్తోంది. మూమెంటమ్ టర్న్ అరౌండ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం రూ.930 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.910 పై స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.1,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.880 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఎటర్నల్: ఆరు నెలలుగా ఈ షేరు అక్యుములేషన్ జోన్‌లో చలిస్తోంది. ప్రస్తుతం మూమెంటమ్, డెలివరీ క్రమంగా పెరుగుతోంది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ షేరుపై ఆసక్తి చూసిస్తున్నారు. గత శుక్రవారం రూ.238 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.230 వద్ద ఎంటరై రూ.285 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.210 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎస్‌బీఐ: ఈ కౌంటర్‌లో ప్రైస్ యాక్షన్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. మూమెంటమ్, డెలివరీ క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం గరిష్టాన్ని బ్రేక్ చేసింది. గత శుక్రవారం రూ.812 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.800 స్థాయిలో ఎంటరై రూ.880 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు.అయితే రూ.775 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
అనంత్‌రాజ్: ఈ రియల్టీ కంపెనీ షేరు ప్రస్తుతం 10,20,50 ఈఎంఏ పై స్థాయిల్లో చలిస్తోంది. షార్ట్‌టర్మ్, మీడియం టర్మ్ మూమెంటమ్ చాలా బాగుంది. గత శుక్రవారం రూ.561 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.550 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.660 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.525 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పేటీఎం: ప్రస్తుతం ఈ కౌంటర్‌లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా రూ.850-900 శ్రేణిలో చలిస్తోంది. రూ.900, రూ.1,000 వద్ద బలమైన నిరోధం ఉంది. వీటిని అధిగమిస్తే మరింత పుంజుకోవటంఖాయం. 55 రోజుల రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.890 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.880 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.960 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.850 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 03:10 AM