ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahindra: కొత్త తరం ఎస్‌యూవీల కోసం ‘న్యూఐక్యూ’ ప్లాట్‌ఫామ్‌

ABN, Publish Date - Aug 16 , 2025 | 05:11 AM

దేశీయ మార్కెట్‌ సహా అంతర్జాతీయ మార్కెట్‌కు కొత్త తరం స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)ను అందించడం లక్ష్యంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ‘న్యూఐక్యూ’ పేరిట ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది.

  • 2027 నాటికి మార్కెట్లోకి 4 కొత్త కార్లు.. మహీంద్రా అండ్‌ మహీంద్రా

ముంబై: దేశీయ మార్కెట్‌ సహా అంతర్జాతీయ మార్కెట్‌కు కొత్త తరం స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)ను అందించడం లక్ష్యంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ‘న్యూఐక్యూ’ పేరిట ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా నాలుగు ఎస్‌యూవీ కాన్సె్‌ప్ట కార్లు.. విజన్‌.ఎ్‌స, విజన్‌.టీ, విజన్‌.ఎ్‌సఎక్స్‌టీ, విజన్‌.ఎక్స్‌లను కూడా ఆవిష్కరించింది.

ఈ సరికొత్త మాడ్యులర్‌ వేదికపై తొలి ఉత్పత్తిని 2027 లో మార్కెట్లోకి తేవాలన్నది తమ లక్ష్యమని ఈ కొత్త వేదిక, కాన్సె్‌ప్టలను విడుదల చేసిన సందర్భంగా గ్రూప్‌ సీఈఓ అనిష్‌ షా చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఇంతవరకు ఎవరూ ప్రవేశించని విభాగంలోకి అడుగు పెట్టేందుకు ఈ కొత్త వేదిక రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా ఈ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీలు 4 మీటర్ల లోపు నిడివి గల మిడ్‌సైజ్‌ ఉత్పత్తులని షా తెలిపారు.

Updated Date - Aug 16 , 2025 | 05:11 AM