ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahindra: ట్రాక్టర్ల విక్రయాలలో భారీ వృద్ధి.. కారణమిదే

ABN, Publish Date - Jun 02 , 2025 | 10:35 PM

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ (FES) మే 2025 నెలకు సంబంధించిన ట్రాక్టర్ విక్రయాల గణాంకాలను ప్రకటించింది. ఈ గణాంకాల ప్రకారం, 2025 మేలో దేశీయంగా 38,914 యూనిట్లను విక్రయించింది.

ముంబై: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ (FES) మే 2025 నెలకు సంబంధించిన ట్రాక్టర్ విక్రయాల గణాంకాలను ప్రకటించింది. ఈ గణాంకాల ప్రకారం, 2025 మేలో దేశీయంగా 38,914 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాది (మే 2024లో) అమ్ముడైన 35,237 యూనిట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఈ ఏడాది మే నెలలో మొత్తం ట్రాక్టర్ల అమ్మకాలు (దేశీయంగా + ఎగుమతులు) 40,643 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో 37,109 యూనిట్లు అమ్ముడయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం, 1,729 యూనిట్లు ఎగుమతయ్యాయి.


ఎందుకంటే..

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌లో భాగమైన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మాట్లాడుతూ.. "గతేడాదితో పోలిస్తే 2025 మే నెలలో దేశీ మార్కెట్లో ట్రాక్టర్ల అమ్మకాలు 10 శాతం వృద్ధి చెంది 38,914 యూనిట్లుగా నమోదయ్యాయి. సాధారణం కన్నా అధిక స్థాయిలో నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో ఖరీఫ్ పంటలు వేసేందుకు సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. వరి పంట కోసం నేలను సిద్ధం చేసుకునే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి" అని తెలిపారు. "వరి, ఇతర ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడమనేది రైతుల్లో సానుకూల సెంటిమెంటుకు దోహదపడుతుంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు మెరుగ్గా ఉండటం, రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించడం మొదలైనవి, రాబోయే రోజుల్లో రైతులు అధిక ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకునేందుకు తోడ్పడతాయి. ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగేందుకు ఇవి దోహదపడతాయి. ఎగుమతి మార్కెట్లలో మేము 1,729 ట్రాక్టర్లు విక్రయించాం" అని విజయ్ నక్రా వివరించారు.


విద్యార్థులకు ఉపకారవేతనాలు..

పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) విభాగం పహెల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు చేయూతనిచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న 186 మంది విద్యార్థినులకు ఉపకారవేతనాలను అందించింది.

Updated Date - Jun 02 , 2025 | 10:35 PM