ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీతం తక్కువైనా నో ఫికర్‌

ABN, Publish Date - May 26 , 2025 | 05:42 AM

వేతనం కాస్తంత తక్కువైనా సరే..దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించినట్టయితే మాకు ఓకే అంటున్నారు ఇప్పుడు ఉద్యోగులు. ఒక పక్క జీవన ప్రమాణ ఒత్తిడులు నానాటికీ పెరిగిపోతుంటే మరోపక్క...

  • దీర్ఘకాలిక ప్రయోజనాలుంటే ఓకే

  • ఉద్యోగుల మనోగతం

ముంబై: వేతనం కాస్తంత తక్కువైనా సరే..దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించినట్టయితే మాకు ఓకే అంటున్నారు ఇప్పుడు ఉద్యోగులు. ఒక పక్క జీవన ప్రమాణ ఒత్తిడులు నానాటికీ పెరిగిపోతుంటే మరోపక్క ఉద్యోగులపై కంపెనీల అంచనాలు కూడా పెరిగిపోయిన నేపథ్యంలో వారి ప్రాధాన్యతల్లో మార్పు వచ్చినట్టు ఒక సర్వేలో తేలింది. హెచ్‌ఆర్‌ సర్వీసులందించే జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది ఇదే అభిప్రాయం ప్రకటించారు. ఆరోగ్యబీమా, రిటైర్మెట్‌ ప్లానింగ్‌, పిల్లల విద్యకు మద్దతు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలున్నట్టయితే వేతనం కాస్తంత తక్కువైనా తమకు సమ్మతమేనని వారు తేల్చి చెప్పారు. 1139 మంది ఉద్యోగులను సర్వేలో భాగంగా ప్రశ్నించారు. వారిలో కేవ లం 32 శాతం మంది తమకు అందిస్తున్న ప్రయోజనాలు తమ సంక్షేమానికి మద్దతు ఇచ్చేవిగా ఉన్నాయని చెప్పగా 61 శాతం మంది ఆ ప్రయోజనాలు చాలవన్న అభిప్రాయం ప్రకటించారు. అయితే 54 శాతం మంది తమ కంపెనీ ఉద్యోగుల మానసిక, ఆర్థిక స్వస్థతకు ప్రాధాన్యం ఇవ్వడంలేదన్నారు. పనితీరు ఆధారిత బోన్‌సలు, ప్రోత్సాహకాలు తమ ఆర్థిక ఒత్తిడులు తగ్గేందుకు దోహదపడతాయని 73 శాతం మంది అంగీకరించారు.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:42 AM