ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేవీబీ లాభంలో 13 శాతం వృద్ధి

ABN, Publish Date - May 20 , 2025 | 03:24 AM

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.513 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.456 కోట్లు)తో...

చెన్నై: కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.513 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.456 కోట్లు)తో పోల్చితే లాభం 13 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా రూ.2,813 కోట్ల నుంచి రూ.3,025 కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 21 శాతం వృద్ధితో రూ.1,605 కోట్ల నుంచి రూ.1,942 కోట్లకు పెరిగిందని కేవీబీ తెలిపింది. కాగా రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.60 (130 శాతం) డివిడెండ్‌ను బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 03:24 AM