Kovascent Tech Merges: కోవాసంట్ టెక్‌లో కోనాఏఐ డీక్యూబ్ డేటా విలీనం
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:59 AM
హైదరాబాద్ టెక్ ప్రపంచంలో మరో విలీనం చోటు చేసుకుంది. పెద్దగా మానవ ప్రమేయం లేకుండా ఖాతాదారులకు కృత్రిమ మేధ (ఏజెంటిక్ ఏఐ) సేవలందించే...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ టెక్ ప్రపంచంలో మరో విలీనం చోటు చేసుకుంది. పెద్దగా మానవ ప్రమేయం లేకుండా ఖాతాదారులకు కృత్రిమ మేధ (ఏజెంటిక్ ఏఐ) సేవలందించే కోవాసంట్ టెక్నాలజీస్.. అమెరికాకు చెందిన కోనాఏఐ, డీక్యూబ్ డేటా సైన్సెస్ కార్పొరేషన్ కంపెనీలను విలీనం చేసుకుంది. అయితే ఈ విలీనానికి సంబంధించిన లావాదేవీల వివరాలను మాత్రం ఈ కంపెనీలు వెల్లడించలేదు. విలీనం అనంతరం ఏర్పడిన కంపెనీని కోవాసంట్ టెక్‌గా వ్యవహరిస్తారు. ఏఐ ఆధారిత కంప్లయెన్స్‌లో కీలకంగా ఉన్న కోనాఏఐ, సైబర్ సెక్యూరిటీ సంస్థ డీక్యూబ్ విలీనంతో అంతర్జాతీయ క్లయింట్లకు ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ గవర్నెన్స్ సొల్యూషన్స్‌ను అందించటంతో పాటు సేవల పోర్టుఫోలియోను విస్తరించే అవకాశం లభిస్తుందని కోవాసంట్ వ్యవస్థాపకుడు సీవీ సుబ్రమణ్యం వెల్లడించారు. 2030 నాటికి ఏజెంటిక్ ఏఐ మార్కెట్ ఏటా 54 శాతం వృద్ధితో 170 కోట్ల డాలర్లకు చేరే అవకాశముందని, దీన్ని అందిపుచ్చుకునేందుకు ఈ విలీనం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. మూడు కంపెనీల విలీనంతో ఏర్పడే సంస్థలో మొత్తం 400 మంది ఉద్యోగులు ఉండనున్నారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:59 AM