ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కియా, టాటా కార్ల ధరలు పెంపు

ABN, Publish Date - Mar 19 , 2025 | 05:36 AM

కార్ల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి పెంచుతున్నట్టు మెర్సిడెస్‌ బెంజ్‌, కియా, టాటా మోటార్స్‌ ప్రకటించాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో పెరిగిన ఉత్పత్తి వ్యయాలను...

న్యూఢిల్లీ: కార్ల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి పెంచుతున్నట్టు మెర్సిడెస్‌ బెంజ్‌, కియా, టాటా మోటార్స్‌ ప్రకటించాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో పెరిగిన ఉత్పత్తి వ్యయాలను కొంత మేరకైనా పూడ్చుకునేందుకు కార్ల ధరలు పెంచక తప్పడంలేదని కియా, టాటా మోటార్స్‌ ప్రకటించాయి. ఏప్రిల్‌ 1 నుంచి తమ కార్ల ధరలు 3 శాతం మేరకు పెంచుతున్నట్టు కియా ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలియచేశారు.

ఈవీలతో సహా అన్ని కార్ల ధరలు పెంపు: టాటా మోటార్స్‌ విద్యుత్‌ కార్ల నుంచి అన్ని రకాల కార్ల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి పెంచబోతున్నట్టు ప్రకటించింది. మోడల్‌, వేరియెంట్‌ను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది. అయితే ఎంత శాతం మేరకు పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించలేదు. టాటా మోటార్స్‌ కార్ల ధర పెంచడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.


రూపాయి బలహీనతే కారణం: మెర్సిడెస్‌

కరెన్సీ మార్కెట్లో రూపాయి బలహీనత కొనసాగినట్టయితే ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలు పెంచక తప్పదని లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ అన్నారు. డిమాండ్‌ అంతగా లేని కారణంగా కనీసం రెండు త్రైమాసికాల పాటు అమ్మకాల్లో ఒత్తిడి కొనసాగుతుందని ఆయన చెప్పారు. గత 20 రోజుల కరెన్సీ కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ యూరో మారకంలో రూపాయి ఇప్పటికే 95కి చేరిందని, ప్రస్తుతం తమ కార్ల ధరలు 90 స్థాయిలో ఉన్నాయని అయ్యర్‌ తెలిపారు. ఈ వ్యత్యాసాన్ని పూడ్చేందుకు తాము ధరలు పెంచక తప్పకపోవచ్చని అయ్యర్‌ చెప్పారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 19 , 2025 | 05:44 AM