ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కియా కారెన్స్‌ క్లావిస్‌ ఈవీ

ABN, Publish Date - Jul 16 , 2025 | 04:00 AM

కియా ఇండియా.. మార్కెట్లోకి కారెన్స్‌ క్లావిస్‌ ఎలక్ట్రిక్‌ కారు (ఈవీ)ను విడుదల చేసింది. కంపెనీ భారత్‌లో ఉత్పత్తి చేసిన తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో...

ప్రారంభ ధర రూ.17.99 లక్షలు

న్యూఢిల్లీ: కియా ఇండియా.. మార్కెట్లోకి కారెన్స్‌ క్లావిస్‌ ఎలక్ట్రిక్‌ కారు (ఈవీ)ను విడుదల చేసింది. కంపెనీ భారత్‌లో ఉత్పత్తి చేసిన తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్‌ కారును కంపెనీ తయారు చేసింది. ఈ కారు ధర రూ.17.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉంది. 42 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో కూడిన కారు ఒకసారి చార్జింగ్‌తో రూ.404 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. అలాగే 51.4 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో కూడిన కారు 490 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కియా తెలిపింది. 100 కిలోవాట్‌ డీసీ చార్జర్‌తో కేవలం 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం బ్యాటరీ చార్జింగ్‌ అవుతుందని పేర్కొంది. ఏడు సీట్ల క్లావిస్‌ ఈవీలో ఏడీఏఎస్‌ లెవల్‌ 2 వ్యవస్థతో పాటు 20కి పైగా అటానమస్‌ ఫీచర్లను పొందుపరిచినట్లు కియా తెలిపింది. కాగా కియా ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్లయిన ఈవీ6, ఈవీ9 మోడళ్లను దిగుమతి చేసుకుని భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 04:00 AM