ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jio IPO: జియో రూ 52000 కోట్ల ఐపీఓ

ABN, Publish Date - Jul 31 , 2025 | 02:30 AM

ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహా అన్ని డిజిటల్‌ సేవల విభాగమైన జియో ఇన్ఫోకామ్‌.. దలాల్‌స్ట్రీట్‌ చరిత్రలో అతిపెద్ద పబ్లిక్‌ ఆఫరింగ్‌కు సిద్ధమవుతోంది. 5 శాతం వాటా విక్రయం ద్వారా 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.52,200 కోట్లు) వరకు...

వచ్చే ఏడాదిలో ఇష్యూకు..

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహా అన్ని డిజిటల్‌ సేవల విభాగమైన జియో ఇన్ఫోకామ్‌.. దలాల్‌స్ట్రీట్‌ చరిత్రలో అతిపెద్ద పబ్లిక్‌ ఆఫరింగ్‌కు సిద్ధమవుతోంది. 5 శాతం వాటా విక్రయం ద్వారా 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.52,200 కోట్లు) వరకు సమీకరించాలని జియో ఇన్ఫోకామ్‌ భావిస్తున్నట్లు బ్లూంబర్గ్‌ కథనం వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్‌ చరిత్రలో అతిపెద్దదైన రూ.28,000 కోట్ల హ్యుండయ్‌ ఐపీఓతో పోలిస్తే జియో దాదాపు రెండింతల అధిక నిధులు సమీకరించనుందన్నమాట. ఐపీఓకు అనుమతి కోసం సెబీతో రిలయన్స్‌ ఇప్పటికే అనధికారిక చర్చలు కూడా ప్రారంభించినట్లు ఆ నివేదికలో తెలిపారు. సంస్థ వచ్చే ఏడాదిలో పబ్లిక్‌ ఇష్యూకు రావచ్చని సమాచారం. ఈ ఆగస్టులో ఆర్‌ఐఎల్‌ నిర్వహించబోయే వాటాదారుల వార్షిక సమావేశంలో జియోతోపాటు రిలయన్స్‌ రిటైల్‌ ఐపీఓలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. జియో ఇన్ఫోకామ్‌లో 2020లో పెట్టుబడులు పెట్టిన మెటా ప్లాట్‌ఫామ్స్‌, గూగుల్‌ వంటి అమెరికన్‌ టెక్‌ దిగ్గజాలు, ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు ప్రతిపాదిత ఐపీఓ ద్వారా తమ వాటాలను కొంత మేర ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. మెటా, గూగుల్‌ పెట్టుబడులు పెట్టిన సమయంలో జియో మార్కెట్‌ విలువను 5,800 కోట్ల డాలర్ల స్థాయిలో లెక్కగట్టగా.. ప్రస్తుతం 10,000 కోట్ల డాలర్లు (రూ.8.7 లక్షల కోట్లు) దాటింది.

జియో ఫైనాన్షియల్‌కు రూ.15,825 కోట్లు : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరు చేసి ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబం, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ లు కలిసి రూ.15,825 కోట్ల మూలధన నిధులు సమకూర్చాలని బుధవారం జరిగిన కంపెనీ బోర్డు సమావేశం లో నిర్ణయించారు. ప్రస్తుతం జేఎ్‌ఫఎ్‌సఎల్‌లో వీరందరికీ కలిపి 47.12 శాతం వాటా ఉండగా.. నిధులు సమకూర్చిన అనంతరం వాటా 54.19 శాతానికి పెరగనుంది.

ఇవి కూడా చదవండి

రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 02:30 AM