ఐటీఆర్ 1 ఐటీఆర్ 2 ఎంచుకోవడం ఎలా
ABN, Publish Date - Jun 08 , 2025 | 03:33 AM
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇప్పటికే అన్ని ఐటీఆర్ ఫారాలను విడుదల చేసింది. ఏటా జూలై నెలాఖరు వరకు ఉండే రిటర్నుల ఫైలింగ్ గడువును ప్రభుత్వం ఈ సంవత్సరం...
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇప్పటికే అన్ని ఐటీఆర్ ఫారాలను విడుదల చేసింది. ఏటా జూలై నెలాఖరు వరకు ఉండే రిటర్నుల ఫైలింగ్ గడువును ప్రభుత్వం ఈ సంవత్సరం సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. అయితే చాలా మంది ఉద్యోగుల్లో తాము ఐటీఆర్-1 ఫైల్ చేయాలా? లేక ఐటీఆర్-2 ఫైల్ చేయాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 15లోగా ఉద్యోగులకు ఫారమ్-16, ఫారమ్-16ఏ అందుబాటులోకి వస్తాయి. అప్పటి నుంచి వారు తమ ఐటీ రిటర్నుల ఫైలింగ్ ప్రారంభించవచ్చు. 2025-26 అసె్‌సమెంట్ ఇయర్ (ఈవై)కు సంబంధించిన ఐటీ రిటర్న్ ఫారాల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసింది. గత ఏడాది వరకు జీతం/పెన్షన్ ఆదాయం, లేదా ఒక ఇంటిపై వచ్చే అద్దె ఆదాయం, సేవింగ్/ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ), డివిడెండ్లు, వార్షిక వ్యవసాయ ఆదాయం రూ.5,000 కంటే తక్కువ ఉంటే ఐటీఆర్-1 (సహజ్) రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోయేది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల అమ్మకంపై వచ్చిన వార్షిక దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టీసీజీ) రూ.1.25 లక్షల వరకు ఉన్న వ్యక్తులు కూడా ఐటీఆర్-1 ఫారమ్ ద్వారా తమ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఐటీఆర్-1
జీతం/పెన్షన్ తప్ప క్లిష్టమైన ఆర్థిక లావాదేవీలు లేని వ్యక్తులు ఐటీఆర్-1 (సహజ్) ద్వారా తమ రిటర్న్ ఫైల్ చేయడం మంచిది. ఈ ఫారమ్‌లో ఆయా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం, ఆదాయ వివరాలు, గత ఆర్థిక సంవత్సరంలో వారు జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు ముందుగానే పూర్తి చేసి ఉంటాయి. కాకపోతే పన్ను చెల్లింపుదారులు ఈ వివరాలను తమ ఫారమ్-16, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఫారమ్-26ఏ, వార్షిక సమాచార స్టేట్‌మెంట్ (ఏఐఎ్‌స)లోని వివరాలతో సరిచూసుకోవాలి.
ఐటీఆర్-1కు అర్హత
స్వదేశంలో నివసించే వ్యక్తులై ఉండాలి
వార్షిక ఆదాయం రూ.50 లక్షలకు మించకూడదు
వార్షిక ఎల్‌టీసీజీ రూ..1.25 లక్షలు మించరాదు
ఐటీఆర్-1 ఫైల్ చేసే వ్యక్తి ఏ కంపెనీలోనూ డైరెక్టర్ పదవిలో ఉండకూడదు
లిస్ట్‌కాని ఏ కంపెనీలోనూ షేర్లు కలిగి ఉండరాదు
ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి విదేశీ ఆదాయం కలిగి ఉండకూడదు
విదేశాల్లో ఎలాంటి ఆస్తులుగానీ, బ్యాంకు ఖాతాలు గానీ కలిగి ఉండరాదు
ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ఈ- సాప్స్)పై చెల్లించాల్సిన చెల్లింపులు, డిడక్షన్లు వాయిదా పడి ఉండరాదు
ఏ రకమైన ఆదాయాన్నీ క్యారీ ఫార్వర్డ్ లేదా బ్రాట్ ఫార్వర్డ్ చేసి ఉండకూడదు.
పైన పేర్కొన్న విషయాల పరిధిలోకి రాని వ్యక్తులు ఐటీఆర్-2 ద్వారా తమ ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేసుకోవచ్చు. వ్యాపారాలు, వృత్తి ద్వారా ఎటువంటి లాభాలు, రాబడులు లేని వ్యక్తులకు ఈ ఫారమ్ చక్కగా సరిపోతుంది.
ఇవీ చదవండి:
మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా.. లేదంటే రూ.10 వేల పైన్
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 08 , 2025 | 03:33 AM