Insurance Expansion India: బీమా కంపెనీలు పల్లె బాట పట్టాల్సిందే
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:46 AM
బీమా కంపెనీలు గ్రామ ప్రాంతాలకూ తమ సేవలను విస్తరించాలని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) స్పష్టం చేసింది. ఇందుకోసం ‘మాస్టర్ సర్క్యులర్ ఆన్ రూరల్, సోషల్ సెక్టర్ అండ్ మోటార్ థర్డ్ పార్టీ ఆబ్లిగేషన్స్...
75,000 గ్రామ పంచాయతీలకు
చేరువ కావాలి: ఐఆర్‌డీఏఐ
న్యూఢిల్లీ: బీమా కంపెనీలు గ్రామ ప్రాంతాలకూ తమ సేవలను విస్తరించాలని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) స్పష్టం చేసింది. ఇందుకోసం ‘మాస్టర్ సర్క్యులర్ ఆన్ రూరల్, సోషల్ సెక్టర్ అండ్ మోటార్ థర్డ్ పార్టీ ఆబ్లిగేషన్స్, 2025 పేరుతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చే రెండేళ్లలో తమ సేవలను 75,000 గ్రామ పంచాయతీలకు విస్తరించాలి. ఇందు లో 25,000 గ్రామ పంచాయతీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, మిగతా 50,000 గ్రామ పంచాయతీలను వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ మొత్తం పాలసీల్లో 15 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం 25 శాతం గ్రామ పంచాయతీల్లో విక్రయించాలి. ఇందుకు సంబంధించి విధి విధానాలను లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయిస్తాయని ఐఆర్‌డీఏఐ తెలిపింది.
ఇవీ చదవండి:
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..
Updated Date - Jul 28 , 2025 | 01:46 AM