ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPO Market Surges: టాప్‌గేర్‌లో ఐపీఓ మార్కెట్‌

ABN, Publish Date - Jul 21 , 2025 | 02:57 AM

పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్‌ కళకళలాడుతోంది. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో 24 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.45,351 కోట్లు సమీకరించాయి. గత ఏడాది ఇదే కాలంలో 36 కంపెనీలు...

ఈ ఏడాది 6 నెలల్లో రూ.45,351 కోట్ల సమీకరణ

2024 ఇదే కాలంతో పోల్చితే 45 శాతం ఎక్కువ

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్‌ కళకళలాడుతోంది. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో 24 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.45,351 కోట్లు సమీకరించాయి. గత ఏడాది ఇదే కాలంలో 36 కంపెనీలు సమీకరించిన రూ.31,281 కోట్లతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. గత ఆరు నెలల్లో ఇష్యూల సంఖ్య తగ్గినా సమీకరించిన నిధులు పెరగడం విశేషం. ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న ఈ జోరు డిసెంబరు వరకు కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. దేశీయ మదుపరులకు ఐపీఓలపై పెరుగుతున్న మోజు, లాభాలు ఇందుకు దోహాదం చేయనున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అనిశ్చితులు పెరిగినా భారత ఐపీఓ మార్కెట్‌ జోరు మీద ఉండడం విశేషం. గత ఏడాది తొలి ఆరు నెలల్లో 52 కంపెనీలు తమ ఐపీఓల కోసం సెబీకి దరఖాస్తు చేస్తే గత ఆరు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 118కు పెరిగింది.

ఎన్‌ఐఆర్‌ఎల్‌ రూ.4,000 కోట్ల ఐపీఓ: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీఐఎల్‌) అనుబంధ సంస్థ ఎన్‌ఐఆర్‌ఎల్‌ రూ.4,000 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతోంది. ఎన్‌ఎల్‌సీఐఎల్‌ సీఎండీ మోటుపల్లి ప్రసన్న కుమార్‌ ఈ విషయం ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులోగా ఈ ఐపీఓ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఐఆర్‌ఎల్‌ పునరుతాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు చెప్పారు.

24 నుంచి బ్రిగేడ్‌ హోటల్స్‌ ఇష్యూ: ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించేందుకు బ్రిగేడ్‌ హోటల్‌ వెంచర్స్‌ ఈ నెల 24న క్యాపిటల్‌ మార్కెట్‌కు వస్తోంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించే రూ.750 కోట్లలో రూ.468.14 కోట్లు రుణ చెల్లింపులకు, రూ.197.52 కోట్లు ప్రమోటర్‌కే చెందిన కొంత స్థలం కొనుగోలుకు వినియోగిస్తారు. మిగతా నిధులను కంపెనీ వ్యాపార విస్తరణ కోసం వినియోగిస్తామని కంపెనీ తెలిపింది.

నేటి నుంచే సావీ ఇన్‌ఫ్రా ఐపీఓ: గుజరాత్‌ కేంద్రంగా పనిచేసే ఈపీసీ కంపెనీ సావీ ఇన్‌ఫ్రా అండ్‌ లాజిస్టిక్స్‌ ఐపీఓ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. రూ.70 కోట్ల సమీకరణ కోసం మార్కెట్‌కు వస్తున్న ఈ ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 23న ముగుస్తుంది. ఈ ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ను రూ.114/120గా నిర్ణయించారు.

ఇతర ప్రధాన అంశాలు

  • ప్రీమియంతో లిస్టయిన 67 శాతం ఐపీఓలు

  • సగటున 25 శాతం రాబడులు పంచిన పబ్లిక్‌ ఇష్యూలు

  • తయారీ, మౌలిక రంగాల నుంచే ఎక్కువ ఐపీఓలు

  • ఈ నెలలో ఇప్పటికే 4 ఇష్యూలు

  • నెలాఖరులోగా మరో ఐదు ఐపీఓలు

అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూలు

కంపెనీ పేరు (రూ.కోట్లలో)

హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.12,500

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ రూ.8,750

స్లాస్‌ బెంగళూరు రూ.3,500

ఏథర్‌ ఎనర్జీ రూ.2,981

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 21 , 2025 | 02:57 AM