ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Investment Tips: మదుపరులూ జాగ్రత్త

ABN, Publish Date - Jul 21 , 2025 | 02:47 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత వచ్చేంత వరకు ఊగిసలాట తప్పకపోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ...

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత వచ్చేంత వరకు ఊగిసలాట తప్పకపోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. నిఫ్టీ సైతం 25,000 దిగువకు రావటం నెగటివ్‌ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తోంది. ఏమైనా సానుకూల సంకేతాలు వస్తే సూచీలు బౌన్స్‌బ్యాక్‌ అయ్యే అవకాశం ఉంది. మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

విప్రో: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తున్న ఈ షేరు ప్రస్తుతం కన్సాలిడేటెడ్‌ అవుతోంది. స్వల్ప,మధ్యకాలిక మూమెంటమ్‌ పర్వాలేదు. తాజా త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ కౌంటర్‌పై ఆసక్తి పెరుగుతోంది. గత శుక్రవారం రూ.266 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.260 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.290 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.256 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ఐసీఐసీఐ బ్యాంక్‌: ప్రస్తుతం ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. స్వల్ప, మధ్యకాలిక మూమెంటమ్‌ లేనప్పటికీ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఆసక్తి పెరిగింది. 20,50 రోజుల చలన సగటు వద్ద షేరు కన్సాలిడేట్‌ అవుతోంది. గత శుక్రవారం రూ.1,425 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,400 శ్రేణిలో బై ఆన్‌ డిప్స్‌ పద్ధతిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,480/1,530 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,375 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బజాజ్‌ ఫైనాన్స్‌: నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు బలాన్ని ప్రదర్శిస్తోంది. మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ క్రమంగా మెరుగవుతోంది. టైట్‌ రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతోంది. గత శుక్రవారం రూ.942 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.910/900 శ్రేణిలో ఎంటరై రూ.980/1,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.880 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎన్‌ఎండీసీ: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు సైడ్‌వే్‌సలో చలిస్తోంది. ప్రస్తుతం అక్యుములేషన్‌ దశ కొనసాగుతోంది. ఎఫ్‌ఐఐలు తమ వాటా పెంచుకున్నారు. మూమెంటమ్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.71 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.70 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.82 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.67 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 21 , 2025 | 02:47 AM