ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం
ABN, Publish Date - Jun 13 , 2025 | 05:05 AM
కొన్ని వారాలుగా అదుపులో ఉన్న ఆహార, నిత్యావసర వస్తువుల ధర లు మే నెలలో మరింతగా దిగొచ్చాయి. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతానికి తగ్గింది...
మే నెలలో 2.82 శాతం
న్యూఢిల్లీ: కొన్ని వారాలుగా అదుపులో ఉన్న ఆహార, నిత్యావసర వస్తువుల ధర లు మే నెలలో మరింతగా దిగొచ్చాయి. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతానికి తగ్గింది. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి. 2019 ఫిబ్రవరిలో నమోదైన కనిష్ఠ స్థాయి 2.57 శాతం తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయికి దిగి రావడం ఇదే ప్రథమం. ఇది ఏప్రిల్‌లో 3.16 శాతం ఉండగా గత ఏడాది మే నెలలో 4.8 శాతంగా ఉంది.
తెలంగాణలో అత్యంత కనిష్ఠం
ప్రాంతాల వారీగా చూసినట్టయితే రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 2.59 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.07 శాతంగా నమోదైంది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా చూసినా తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ఠ స్థాయి 0.55 శాతంగా నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News
Updated Date - Jun 13 , 2025 | 05:05 AM