ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Industrial Growth India: 10 నెలల కనిష్ఠానికి పారిశ్రామికం

ABN, Publish Date - Jul 29 , 2025 | 06:10 AM

పారిశ్రామిక రంగం జూన్‌ నెలలో నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. మైనింగ్‌, విద్యుత్‌ రంగాలు తీవ్ర వర్షాలకు ప్రభావితం కావడం ఈ రంగాన్ని కుంగదీసింది..

న్యూఢిల్లీ/ముంబై : పారిశ్రామిక రంగం జూన్‌ నెలలో నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. మైనింగ్‌, విద్యుత్‌ రంగాలు తీవ్ర వర్షాలకు ప్రభావితం కావడం ఈ రంగాన్ని కుంగదీసింది. ఫలితంగా జూన్‌లో పారిశ్రామిక వృద్ధి రేటు 10 నెలల కనిష్ఠ స్థాయి 1.5 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఆగస్టు తర్వాత ఈ రంగం వృద్ధి ఇంత కనిష్ఠ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా మదింపు చేసే ఈ వృద్ధి రేటు గత ఏడాది జూన్‌లో 4.9% ఉంది. కాగా మే నెల పారిశ్రామికాభివృద్ధి గణాంకాలను జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) గతంలో ప్రకటించిన 1.2% నుంచి 1.9 శాతానికి సవరించింది. ఎన్‌ఎ్‌సఓ గణాంకాల ప్రకారం జూన్‌ నెలలో తయారీ రంగం వృద్ధి 3.5ు నుంచి 3.9 శాతానికి పెరిగింది.

రెండింతలు పెరిగిన అపోలో మైక్రోసిస్టమ్స్‌ లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో మైక్రోసిస్టమ్స్‌ లిమిటెడ్‌.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.17.68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.8.42 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా రెండింతలు వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 46.49 శాతం వృద్ధితో రూ.91.78 కోట్ల నుంచి రూ.134.55 కోట్లకు పెరిగింది.

Updated Date - Jul 29 , 2025 | 06:15 AM