ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

INDIE: 'ఇండీ' యాప్‌ను విస్తరించిన ఇండస్‌ఇండ్ బ్యాంక్

ABN, Publish Date - Jun 05 , 2025 | 10:37 PM

ఈ యాప్ ద్వారా భవిష్యత్ అవసరాలకు తగిన, సురక్షితమైన, సంపూర్ణ బ్యాంకింగ్ సేవలను అందించడమే తమ లక్ష్యమని బ్యాంక్ వెల్లడించింది.

ముంబై, జూన్ 5, 2025: ఇండస్‌ఇండ్ బ్యాంక్ తన అధునాతన ఆర్థిక యాప్ 'ఇండీ'(INDIE)ని విస్తరించింది. 1.5 కోట్ల మందికి పైగా ఉన్న రిటైల్ బ్యాంకింగ్ కస్టమర్లందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా భవిష్యత్ అవసరాలకు తగిన, సురక్షితమైన, సంపూర్ణ బ్యాంకింగ్ సేవలను అందించడమే తమ లక్ష్యమని బ్యాంక్ వెల్లడించింది. సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలు, క్రెడిట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్ సహా అనేక సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి 'ఇండీ' తీసుకువచ్చింది. 'ఇండీ' యాప్ ఇప్పటికే 14 లక్షలకు పైగా కొత్త ఖాతాలను ఆకర్షించింది. దీని నెలవారీ యాక్టివ్ యూజర్ల (MAU) రేటు సగటున 50%గా ఉంది. ఈ యాప్ నంబర్‌లెస్ డెబిట్ కార్డ్, వర్చువల్ సింగిల్-యూజ్ కార్డ్, డైనమిక్ ఏటీఎం పిన్‌లు వంటి వినూత్న ఫీచర్లను అందిస్తుంది.


పూర్తిగా డిజిటల్, బ్రాంచ్‌రహిత ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ ద్వారా రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం అవుతాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్, స్ట్రాటజీ (ఎగ్జిస్టింగ్ బిజినెస్) హెడ్ చారు సచ్‌దేవా మాథుర్ మాట్లాడుతూ, ప్రస్తుత రిటైల్ వినియోగదారులందరికీ 'ఇండీ' సేవలను విస్తరించడంపై తాము సంతోషిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగినట్లుగా భవిష్యత్-సిద్ధంగా ఉండే డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను సృష్టించడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు. 'ఇండీ' ద్వారా ఎంపిక చేసిన బ్రాండ్స్, ఇంధన కొనుగోళ్లపై 3% వరకు రివార్డులు, డెబిట్ కార్డ్ లావాదేవీలపై జీరో ఫారెక్స్ మార్కప్, ఉచిత లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. వడ్డీ రేటుతో అనుసంధానించబడిన పొదుపు, ఆటో స్వీప్ ఫీచర్లు, అలాగే రూ. 5 లక్షల వరకు ఫ్లెక్సిబుల్ లైన్ ఆఫ్ క్రెడిట్ వంటి స్మార్ట్ డిపాజిట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Jun 06 , 2025 | 10:07 PM