ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

5 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

ABN, Publish Date - May 16 , 2025 | 04:39 AM

భారత విదేశీ వాణి జ్య లోటు 5 నెలల గరిష్ఠ స్థాయికి పెరిగింది. గత నెలలో 2,642 కోట్ల డాలర్లకు (రూ.2.26 లక్షల కోట్లు) చేరింది. ట్రంప్‌ సుంకాల పెంపు నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం, వస్తు సరఫరాను...

ఏప్రిల్‌లో రూ.2.26 లక్షల కోట్లు

ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి

19 శాతం ఎగబాకిన దిగుమతులు

న్యూఢిల్లీ: భారత విదేశీ వాణి జ్య లోటు 5 నెలల గరిష్ఠ స్థాయికి పెరిగింది. గత నెలలో 2,642 కోట్ల డాలర్లకు (రూ.2.26 లక్షల కోట్లు) చేరింది. ట్రంప్‌ సుంకాల పెంపు నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం, వస్తు సరఫరాను తలకిందులు చేయడం ఇందుకు ప్రధాన కార ణం. ఈ ఫిబ్రవరిలో వాణిజ్య లోటు మూడేళ్ల కనిష్ఠ స్థాయి 1,405 కోట్ల డాలర్లకు తగ్గగా.. మార్చిలో 2,154 కోట్ల డాలర్లకు పెరిగింది. ఏప్రిల్‌లో మరింత ఎగబాకింది. గత నెలలో భారత వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 9.03 శాతం వృద్ధితో ఆరు నెలల గరిష్ఠ స్థాయి 3,849 కోట్ల డాలర్లకు (రూ.3.29 లక్షల కోట్లు) పెరిగాయి. కానీ, అదే సమయంలో దిగుమతులు కూడా 19.12ు పెరిగి 6,491 కోట్ల డాలర్లకు (రూ.5.55 లక్షల కోట్లు) ఎగబాకాయి. దాంతో వాణిజ్య లోటు (ఎగుమతుల ఆదాయం, దిగుమతుల వ్యయం మధ్య అంతరం) 2,642 కోట్ల డాలర్లుగా నమోదైంది. ముడిచమురు, ఎరువుల డిమాండ్‌ ఎగబాకడం దిగుమతుల పెరుగుదలకు కారణమయ్యాయి.


సేవల్లో రూ.1.52 లక్షల కోట్ల మిగులు వాణిజ్యం: గత నెలలో సేవల ఎగుమతులు 3,531 కోట్ల డాలర్లు (రూ.3.02 లక్షల కోట్లు)గా, దిగుమతులు 1,754 కోట్ల డాలర్లు (రూ.1.50 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. దాంతో వాణిజ్య మిగులు 1,777 కోట్ల డాలర్లకు (రూ.1.52 లక్షల కోట్లు) పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2025 | 04:39 AM