పెరిగిన ఫార్మా ఎగుమతులు
ABN, Publish Date - Jul 03 , 2025 | 04:51 AM
అంతర్జాతీయఅనిశ్చితిలోనూ మన ఫార్మా ఎగుమతులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో మన దేశంనుంచి 496.17 కోట్ల డాలర్ల (సుమారు రూ.42,482 కోట్లు)విలువైన ఫార్మా...
రెండు నెలల్లో రూ.42,482 కోట్లు
హైదరాబాద్: అంతర్జాతీయఅనిశ్చితిలోనూ మన ఫార్మా ఎగుమతులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో మన దేశంనుంచి 496.17 కోట్ల డాలర్ల (సుమారు రూ.42,482 కోట్లు)విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.38 శాతం ఎక్కువని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్) తెలిపింది. తాము తీసుకున్న వ్యూహాత్మక చర్య లు ఇందుకు ఎంతగానో దోహదం చేసినట్టు పేర్కొం ది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో మన దేశం నుంచి జరిగిన ఫార్మా ఎగుమతుల్లో ఫార్ములేషన్స్, బయోలాజిక్స్ వాటా 75.74 శాతం; బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ వాటా 4.4 శాతం వరకు ఉన్నట్టు తెలిపింది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ దేశాలు మన దేశం నుంచి ఔషధాలు దిగుమతి చేసుకోవడంలో అగ్రస్థానంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 04:51 AM