చమురు దిగుమతులు జూమ్..
ABN, Publish Date - Apr 21 , 2025 | 02:31 AM
మన దేశ చమురు దిగుమతులు ఏటికేటికి పెరిగి పోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) భారత్.. విదేశాల నుంచి 24.24 కోట్ల టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే ...
2024-25లో రూ.13.76 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మన దేశ చమురు దిగుమతులు ఏటికేటికి పెరిగి పోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) భారత్.. విదేశాల నుంచి 24.24 కోట్ల టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే ఇది 4.2 శాతం ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన మొత్తం చమురు అవసరాల్లో 89.1 శాతం దిగుమతుల ద్వారానే భర్తీ అయింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది అర శాతం ఎక్కువ. ఇదే సమయంలో దేశీయ చమురు ఉత్పతి మాత్రం 2.94 కోట్ల టన్నుల నుంచి 2.87 కోట్ల టన్నులకు పడిపోయింది.
పెరిగిన భారం: 2024-25 ఆర్థిక సంవత్సరంలో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లు 15,630 కోట్ల డాలర్ల నుంచి 16,100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.13.76 లక్షల కోట్లు) చేరింది. ఇదే సమయంలో గ్యాస్ దిగుమతులూ 15.4 శాతం పెరిగి 3,669.9 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎంఎ్‌ససీఎం)కు చేరాయి. కాగా దేశీయ గ్యాస్ ఉత్పత్తి 3,611.3 ఎంఎంఎ్‌ససీఎంకు పడిపోయింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 0.9 శాతం తక్కువ.
ఇంధన స్టోరేజీలోకి రూ.4.79 లక్షల కోట్ల పెట్టుబడులు: మన దేశ ఇంధన స్టోరేజీ రంగం 2032 నాటికి భారీగా పెట్టుబడులను ఆకర్షించనుంది. ఇది ఎంత లేదన్నా రూ.4.79 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఇండియా ఎనర్జీ స్టోరేజీ అలయెన్స్ (ఐఈఎ్‌సఏ) అంచనా. 2026-32 మధ్య కాలంలో ఈ రంగం ఐదింతలు పెరగనుంది. టెక్నాలజీ నవకల్పనలతో గత రెండున్నర సంవత్సరాల్లో నెలకు ఒక మెగావాట్ ఇంధన స్టోరేజీ ఖర్చులు రూ.10 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు తగ్గినట్టు ఐఈఎ్‌సఏ తెలిపింది.
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 21 , 2025 | 02:31 AM